ప్రస్తుతం భారత్ న్యూజిలాండ్ మధ్యటెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇక మొదటి టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తుంది అని అనుకున్నప్పటికీ డ్రాగా ముగియడం మాత్రం భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ నిరాశపరిచింది. అయితే భారత్ గెలవకుండా డ్రా అయ్యేలా చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు చివర్లో  బాగా రాణించడమే కారణమని చెప్పాలి. అయితే ముఖ్యంగా భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ఆటగాడే భారత్ గెలవకుండా  కీలక పాత్ర వహించారు అన్నది తెలుస్తుంది. అతనే రచిన్ రవీంద్ర.


 గత కొంత కాలం నుంచి రచిన్ రవీంద్ర పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఈ పేరు చూస్తే అతడు భారతీయుడు అనేది అర్థమైపోతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ యువ ఆటగాడు. అయితే రచిన్ రవీంద్ర తండ్రి కృష్ణ మూర్తి బెంగళూరుకు చెందినవాడు. ఆయన కూడా మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్ తో కలిసి దేశవాళీ క్రికెట్ ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి చివరికి న్యూజిలాండ్కు వెళ్లిపోయారు. అయితే కృష్ణమూర్తికి క్రికెట్ పై మక్కువ ఉండడంతో తన కొడుకుని క్రికెటర్గా చేయాలనుకున్నాడు. అయితే కృష్ణమూర్తికి రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ అంటే ఎంతో ఇష్టం.. ఈ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా రచిన్ అనే ఒక పేరు పెట్టారు కృష్ణమూర్తి..


 ఇక తండ్రి నమ్మకాన్ని నిలబెట్టిన ఈ యువ క్రికెటర్ ఏకంగా ఇరవై రెండేళ్ల సమయం లోనే న్యూజిలాండ్ జట్టుకు ఎంపికయ్యాడు. అదే ఏడాది బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడు ఇంకా బౌలింగ్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. ఇటీవలే టెస్ట్ సిరీస్లో కూడా అవకాశం దక్కించుకున్న రచిన్ రవీంద్ర బౌలింగులో రాణించక పోయినప్పటికీ చివరిరోజు కివీస్కు ఓటమి ఖాయం అనుకున్న దశలో అసాధారణ పోరాట ప్రతిభ కనబరిచి ఏకంగా జట్టు ఓటమి పాలు అవకుండా కీలకంగా వ్యవహరించాడు. ఏకంగా 9
1  బంతుల పాటు బ్యాటింగ్ చేశాడు. ఏకంగా భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం అతని బ్యాటింగ్ నైపుణ్యాన్ని కొనియాడారు. ఇలా భారత్ గెలవకుండా మ్యాచ్ డ్రా గా ముగియడానికి రచిన్ రవీంద్ర కారణం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: