ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎటువంటి వ్యూహాలతో బరిలోకి దిగనున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా తుది జట్టుపై కూడా చాలా కసరత్తులు చేస్తోంది జట్టు యాజమాన్యం. ఎందుకంటే.. గత మ్యాచ్ లో చాహల్ , హార్దిక పాండ్య విఫలం కావడం, భువి సైతం ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం తో ఆల్టర్నేటివ్ గా బౌలర్స్ ను సెట్ చేస్తున్నారు. ఇక బ్యాటింగ్ యూనిట్ లో సైతం మార్పులు తప్పవని తెలుస్తోంది. అయితే ఎవరు అనేది అధికారికంగా తెలియాలంటే మ్యాచ్ సమయం వరకు వేచి చూడాల్సిందే.
ఇక ఎప్పటిలాగే టీ 20 లో ఏ జట్టును కూడా తేలిగ్గా తేసుక్కూడదు. ఇందుకు నిదర్శనమే ఆసియా కప్ లో అదరగొడుతున్న ఆఫ్గనిస్తాన్ జట్టు. శ్రీలంక జట్టు నిండా ఆల్ రౌండర్లు ఉండడం వారికి కలసిసొచ్చే అంశం. ఈ మ్యాచ్ లో గెలుపుకు మొదటి పునాది మాత్రం టాస్ గెలవడమే. టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే సగం మ్యాచ్ గెలిచినట్లే. మరి ఈ రోజు ఇండియాకు చావో రేవో మ్యాచ్ లో గెలిచి ఆసియా కప్ ట్రోఫీకి పోటీలో ఉంటుందా అన్నది చుద్దా,.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి