
ఇక ఇప్పుడు కూడా పాకిస్తాన్ జట్టులో షాహిన్ ఆఫ్రిది, నసీంషా, హరీష్ రావుఫ్ లాంటి వారి బౌలింగ్ చూసినప్పుడు క్రికెట్ ప్రేక్షకులందరికీ ముచ్చట వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం జట్టులో యువ ఫేసర్ గా కొనసాగుతున్నాడు నసీం షా, ఆసియా కప్లో ఇండియాతో జరిగిన మ్యాచ్ లోనే తన డెబ్యు మ్యాచ్ ఆడాడు. అయితే మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ లో కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక తనదైన రోజు నసీం షా చురకత్తుళ్లాంటి బంతులు సంబంధించి మ్యాచ్ను తిప్పేయగలడు అని ఎంతోమంది విశ్లేషకులు అభిప్రాయం.
ఇక నసీం షా బౌలింగ్ ఇలా ఉంటే ఇక ఇప్పుడు అతని తమ్ముడి బౌలింగ్ అయితే మరింత ఆకట్టుకునేలా ఉంది అని చెప్పాలి. నసీం షా తమ్ముడు 18 ఏళ్ల హుస్సేన్ షా ఇప్పుడు అన్నను మించిపోయేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడుతున్న హుస్సేన్ షా ఇటీవలే మ్యాచ్లో ఒక్క వికెట్ మాత్రమే తీసినప్పటికీ అతని బౌలింగ్ లో లైన్ అండ్ లెంగ్త్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. ఇక అతని బౌలింగ్ కి సంబంధించిన ఒక వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటికే నసీం షా అడుగు పాకిస్తాన్ జట్టులో పడింది. ఇక ఇప్పుడు అతని తమ్ముడు హుస్సేన్ షా వంతు వచ్చింది అని ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.