ప్రపంచ క్రికెట్లో రికార్డులు రారాజు ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా విరాట్ కోహ్లీ పేరునే చెబుతూ ఉంటారు. ఎందుకంటే అందరిలాగానే ఒక సాదా సీదా క్రికెటర్ లాగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన విరాట్ కోహ్లీ.. అతి తక్కువ సమయంలోనే తాను జట్టులోకి వచ్చి పోయే ఆటగాడిని కాదు.. చరిత్రలో నిలిచిపోయి ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆట తీరుతో నిరూపించాడు. ఇక కెరియర్ స్టార్టింగ్ నుంచి రికార్డుల వేట మొదలు పెట్టిన విరాట్ కోహ్లీ.. రికార్డుల రారాజుగా అవతరించాడు అని చెప్పాలి.


 అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా కొత్తగా క్రికెట్లోకి వచ్చిన ఆటగాడిలో ఉండే కసి కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఏదో రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యంగా అతని బ్యాటింగ్ విధ్వంసం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడం.. మిగతా ఆటగాళ్లకు కాస్త కష్టతరమైన విషయమే. కానీ కొంతమంది ఆటగాళ్లు సాధించిన రికార్డులను బద్దలు కొట్టి.. తమ పేరును లికించుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల ఇలాగే కోహ్లీ పేరిట ఉన్న ఒక రికార్డు బద్దలైంది. బంగ్లాదేశ్ కెప్టెన్ గా కొనసాగుతున్న నజ్మూలు హుస్సేన్ ఇలా కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.



 ఇటీవల తన ఇన్నింగ్స్ తో ఒక అరుదైన ఘనత సాధించాడు అని చెప్పాలి. కెప్టెన్గా తన మొదటి టెస్టులోనే సెంచరీ సాధించాడు. దీంతో కోహ్లీ రికార్డు బద్దలైంది. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో టెస్ట్ మ్యాచ్లో అతను శతకం సాధించాడు అని చెప్పాలి. దీంతో టెస్ట్ కెప్టెన్సీ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు నాజ్ములు హుస్సేన్. ఇప్పటివరకు ఈ రికార్డు సాధించిన వారిలో విరాట్ కోహ్లీ, జోరూట్, స్మిత్, శివ నారాయన్ చంద్రపాల్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ కూడా చేరిపోయాడు. ఇలా కెప్టెన్గా అరంగేట్రా టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేసిన 32వ ప్లేయర్గా అంతర్జాతీయ క్రికెట్లు రికార్డు సృష్టించాడు నజ్ముల్ హుసేన్.

మరింత సమాచారం తెలుసుకోండి: