బ్యాంక్ అకౌంట్ ఉన్న  ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ అవసరమే. అలాంటి  మీ పాన్ కార్డ్ లో ఏదైనా తప్పులు ఉన్నాయా.? అయితే ఏం బాధపడకండి. మీ పాన్ కార్డ్ వివరాలను ఆన్లైన్లో మీరు సరి చేసుకోవచ్చు. మీ ఇంటి చిరునామా, మీ పేరును ఇంకా వేరే ఏమైనా వివరాలను ఆన్లైన్ లో చాలా సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


NSDL ( National securities depository Limited) అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చేసుకోవచ్చు. NSDL e-Gov- అనేది, PAN దరఖాస్తులు ఆమోదం మరియు ప్రాసెసింగ్ కోసం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చేత నిర్వహించబడుతుంది. పన్ను చెల్లించేటప్పుడు  పన్ను చెల్లింపు దారుని సూచించడానికి మరియు ఆదాయ పన్ను రాబడిని చెల్లించడానికి ఈ వెబ్సైట్  తప్పనిసరి.

ఆన్ లైన్లో PAN CARD వివరాలను ఎలా అప్డేట్ చేయాలి..?

1). ముందుగా NSDLe-Gov- గవర్నర్ పాన్ కార్డు కు ఏమైనా మార్పులు అభ్యర్థించడానికి ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది Onlineservies. nsdl. Com లోకి వెళ్ళండి.
2). అప్లికేషన్ టైప్ నుండి వచ్చిన ఎంపికలలో 'change or correction exiting pan data ' ను ఎంపిక చేయాలి.
3). దరఖాస్తుదారు యొక్క వ్యక్తిగత వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
4). మీరు సబ్మిట్ చేసిన తర్వాత కొత్త పేజీకి మళ్ళించపడతారు. ఇక్కడ ఒక టోకెన్ నెంబర్ సృష్టించబడుతుంది.
5). ఈ టోకెన్ నెంబర్ దరఖాస్తులో అందించిన ఈ మెయిల్ ఐడి కి పంపబడుతుంది.
6). ఇప్పుడు e-సైన్ ద్వారా స్కాన్ చేసి 'ఇమేజెస్' అందించి సబ్మిట్ చేయండి
7). ఇప్పుడు ఇక్కడ మీ PAN సంఖ్యను సూచిస్తుంది
8). మీరు మార్చుకోవాలనుకుంటున్న  వాటిలో సరైన వాటిని ఎంచుకుని వాటి యొక్క ఎడమ  అంచుపై సంబంధిత బాక్స్ ను ఎంచుకోండి.
9). దరఖాస్తుదారు వారి నివాసం లేదా కార్యాలయము చిరునామా లేదా పేరును సూచించాలి.
10). దరఖాస్తుదారుడు ఏ చిరునామాను పునరుద్ధరించాలనుకుంటున్నాడో, వారు అదే వివరాలు ఫారంలో జోడించి, అదనపు పేజీలు పూర్తి చేయాలి.
11). దరఖాస్తుదారుని పేరు యొక్క ఫ్రూఫ్ తప్పనిసరి.
12). ఫారం నింపిన తర్వాత రసీదు సృష్టించబడుతుంది. ఆ సృష్టించిన రసీదును మిగిలిన పత్రాలకు జత చేసి కింది చిరునామాకు పంపించండి.
 Income Tax Pan services unit -( managed by NSDL e- Governance Infrastructure Limited)
5th floor, Mantri Sterling, platNo. 341,
 Survey number.997/8, Model Colony,
 Deep Bungalow Chowk, pune-411016

మరింత సమాచారం తెలుసుకోండి: