ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది కామన్ గా కనిపిస్తూ ఉన్నది.. ఇంట్లో ఏ వస్తువు ఉన్నా లేకపోయినా మాత్రం మొబైల్ మాత్రం కచ్చితంగా ఉండనే ఉంటుంది ప్రజల దగ్గర. అయితే ఎంత లేటెస్ట్ మొబైల్ అయినా సరే కొద్దిరోజులు ఉపయోగించుకున్నాక పలు రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది బ్యాటరీ బ్యాకప్. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఫోన్లో, ల్యాప్ టాప్ వంటి వాటిలలో ఎక్కువగా లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇవి కొద్ది రోజులు ఉపయోగించాక..అనేక సమస్యలను కలిగిస్తాయి నెమ్మదిగా బ్యాటరీ లైఫ్ అనేది కోల్పోతూ ఉంటుంది. అలా అయిన తరువాత కొద్దిసేపటికి మొబైల్ ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అయితే మొబైల్ బ్యాటరీ ఎక్కువ కాలం ఎలా ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1). ముఖ్యంగా మనం మన మొబైల్ లో ఛార్జ్ చేసేటప్పుడు చార్జీ పర్సంటేజ్.-100 % అయ్యేవరకు చార్జింగ్ పెట్టకూడదు. అలాగని మరి 0% వచ్చే వరకు చార్జింగ్  పెట్టకుండా ఉండకూడదు. బ్యాటరీ కేవలం 90% మాత్రమే చార్జింగ్ చేస్తే చాలు.. ఇక 20%  కంటే తక్కువగా పడిపోకుండా చార్జింగ్ చేసుకోవాలి


2). మన మొబైల్ ని రాత్రి సమయాలలో చార్జింగ్ పెట్టి అలాగే ఆన్ లో ఉంచకూడదు. అలా చేసినప్పుడు బ్యాటరీ అధిక ఓల్టేజ్ నుండి ఎక్కువ శక్తిని గ్రహించి బ్యాటరీ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది.

3). మొబైల్ కి,ల్యాప్ టాప్ కి ఎక్కువగా WIFI, బ్లూటూత్ వంటివి వాడినప్పుడు ఎక్కువగా చార్జింగ్ అయిపోతుంది అందుచేతనే వాటిని ఆఫ్ చేయడం మంచిది.

4). ముఖ్యంగా మొబైల్స్ లో యాప్ లు ఎక్కువగా ఉండటం వల్ల చార్జింగ్ త్వరగా అయిపోతుంది అందుచేతనే అవసరం లేని సమయంలో లొకేషన్స్ ని ఆఫ్ చేయడం.. యాప్స్ ని తొలగించడం మంచిది.

ఇక అంతే కాకుండా బ్రైట్నెస్ డార్క్ మోడ్ లో పెట్టుకోవడం, పవర్ సేవింగ్ మోడ్ లో పెట్టుకోవడం, డేటా అని ఆఫ్ చేయడం .. వంటివి తరచూ చేస్తూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: