బిగ్ బాస్ సీజన్ 6 లో ఇక మిగిలింది కేవలం మూడు వారాలే... మొత్తం 21 మందితో కళకళలాడిన బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం 8 మందితో ఉంది. గత వారం జరిగిన నామినేషన్ గురించి సోషల్ మీడియాలో ఇంకా చర్చ జరుగుతోంది. తనకన్నా తక్కువ ఓట్లు వచ్చిన రాజ్ ను నామినేట్ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అందుకే ఆఖరిగా మిగిలిన రాజ్ మరియు పైమా లలో.. ఫైమాకు తక్కువ ఓట్లు పోలయినట్లు నాగార్జున తెలియచేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు ఏవిక్షన్ పాస్ ఉండడం వలన తాను సేవ్ అయింది. దీనితో అనుకోకుండా రాజ్ ఇంటి నుండి వెళ్ళిపోయాడు.

ఇక నిన్న జరిగిన ఎలిమినేషన్ లో మరోసారి రేవంత్ టార్గెట్ గా మారాడు. తన ఫ్రెండ్స్ గా ఉన్న శ్రీహన్ మరియు శ్రీసత్య లు తప్ప మిగిలిన అయిదు మాది రేవంత్ ను నామినేట్ చేయడం విశేషము. ముఖ్యంగా ఫైమా మరియు రేవంత్ ల మధ్యన జరిగిన చర్చ ఒకానొక సమయంలో ప్రేకాకులకు మరియు ఇంటిలో ఉన్న సభ్యులకు విసుగు తెప్పించింది అని చెప్పాలి. ఇక ఫైమా అయితే అడ్డదిడ్డంగా వాదనతో బిగ్ బాస్ హౌస్ లో దద్దరిల్లిపోయేలా చేసింది. ఏ పాయింట్ మాట్లాడినా వెటకారంగా మాట్లాడడం , ప్రూఫ్ లేకుండా హేళనగా వాదించడం చూస్తే ఇన్ని రోజులు తనను నమ్మి ఓట్లు వేసిన ప్రేక్షకులకు సైతం కోపం వచ్చి ఉంటుందని అనుకోవచ్చు.

ఇక రేవంత్ తో ఫైమా మాట్లాడిన తీరుతో బయట రేవంత్ ను ఎంతో ఇష్టపడుతున్న అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఎలాగూ ఈ వారం ఫైమా కూడా నామినేషన్ లో ఉండడంతో వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. గత వారమే ఏవిక్షన్ పాస్ వలన సేవ్ అయిన ఫైమా , ఈ వారం రేవంత్ ఫ్యాన్స్ ఆగ్రహానికి బలి కావాల్సిందే అంటూ బయట టాక్ వినబడుతోంది. దీనిని బట్టి చూస్తే ఈ వారంతో బిగ్ బాస్ లో ఫైమా చీటీ చిరిగినట్లే అని వార్తలు వస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: