జబర్దస్త్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు పేర్లు ఏమిటంటే జడ్జిలుగా రోజా, నాగబాబు ఆ తర్వాత యాంకర్లుగా అనసూయ, రష్మి పేర్లు గుర్తుకు వస్తూ ఉంటాయి. వీరిద్దరి పాపులారిటీతో పలు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకున్నారు.అయితే ఈ మధ్యనే యాంకర్ అనసూయ జబర్దస్త్ గుడ్ బై చెప్పేసింది. అయితే అందుకు కారణం మాత్రం తెలియజేయడం లేదు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అనసూయకు సినిమాలలో అవకాశాలు వస్తున్నాయని అందుకే జబర్దస్త్ను వదిలేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనసూయ జబర్దస్త్ ను వీడిన తర్వాత ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి.


కానీ అనసూయ పలు వెకేషన్ కు వెళ్తూ కుటుంబంతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. రీసెంట్గా రష్మీ కూడ  జబర్దస్త్ నుంచి తప్పుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇందులో ఉండే వల్గర్ కామెంట్స్ వాళ్ల రష్మి కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటుందని మల్లెమాల సన్నిహితుల నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనసూయ పరిస్థితిని చూసిన తర్వాత రష్మి ఎట్టి పరిస్థితుల్లో ఈ షోలను వదులుకోవడానికి ఇష్టపడలేదని ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.


అంతేకాదు ఫైనాన్షియల్ పరంగా ఎటువంటి హెల్ప్ లేని రష్మీకి జబర్దస్త్ దిక్కు అంటూ పలు వురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ లో ఇంత దారుణంగా బాడి సేమింగ్స్ చేస్తున్నారా అంటూ పలువురు నెటిజన్స్ సైతం తెలియజేస్తున్నారు. ఇలా చేస్తూ ఉంటే మల్లెమాల సంస్థ ఏం చేస్తుందీ అంటూ కూడా పలువురు అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో నైనా జబర్దస్త్ లో జరిగే ఎటువంటి వాస్తవాల పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. ఒకవైపు సినిమాల లో మరొకవైపు బుల్లితెర పైన బాగానే సంపాదిస్తుంది రష్మీ.

మరింత సమాచారం తెలుసుకోండి: