
అయితే చాలామంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి రకరకాల నైవేద్యాలు పిండి వంటలు చేసి పెడుతూ ఉంటారు . అది నిజంగా చాలా మంచిది . కానీ అందరూ అలా చేయలేరు . ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు లేదా ఇంట్లో చంటి పిల్లలు ఉన్నప్పుడు మహిళలకి ఎక్కువగా పని ఉంటుంది . ఆ కారణంగా కొందరు మహిళలు ఎక్కువ రకాల పిండి వంటలు చేసి పెట్టలేకపోవచ్చు . ఆ కారణంగా బాధపడాల్సిన అవసరం లేదు . అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసుకుంటే ఖచ్చితంగా ఆమె మీరు కోరిన కోరికలు తీరుస్తుంది . ఎవరైతే ఇంట్లోని పనులు కారణంగా అమ్మవారికి రకరకాల నైవేద్యాలు చేసి పెట్టలేకపోతున్నారో.. అలాంటివారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం చేసి పెడితే చాలా మంచిది అంటున్నారు పండితులు.
కొంచెం బెల్లం లో కొన్ని నీళ్లు ..రెండు మిరియాలు ..నాలుగు తులసి ఆకులు.. ఒక యాలక.. వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి .. దేవుడు గదిలో తులసి ఆకులతో అమ్మవారిని పూజించి.. ధూప దీపాలతో అమ్మవారిని పూజిస్తే విశేషమైన ఫలితాలు అందుతాయి అంటూ పండితులు చెబుతున్నారు . మరెందుకు ఆలస్యం ఎవరైతే అమ్మవారికి రకరకాల నైవేద్యాలు చేసి చేసిపెట్టలేము అంటూ బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు ఈ ఒక్క చిన్న పని చేస్తే అమ్మవారు సంతృప్తిరాలవుతారు. ఆ శ్రీ మహాలక్ష్మి కృపకటాక్షాలు ఎప్పుడు మీ కుటూంబం పై ఉంటాయి..!