
ఈరోజు వసుధార రియల్ లైఫ్ స్టోరీ గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.. గుప్పెడంత మనసు సీరియల్ లో నటించే రిషి , వసుధార జంట చాలా ఫేమస్ . అందుకే ఇద్దరిని కలిపి రిషిధారా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సీరియల్ లో వీళ్ళ ప్రేమ కథ చాలా క్యూట్ గా ఉంటుంది వసుధార అసలు పేరు రక్షా గౌడ. ఈమె వాస్తవానికి తెలుగమ్మాయి కాదు కన్నడ అమ్మాయి. ఆమె బెంగళూరుకి చెందింది. చిన్నప్పటి నుంచి వసుధార నటన మీద ఆసక్తి పెంచుకోవడంతో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. అలా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.
అందంతో, నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ మొదటగా కన్నడ సీరియల్స్ లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకొని ఫుట్ మాలీ అనే కన్నడ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రావడంతో కృష్ణవేణి అనే సీరియల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ. అప్పుడు అంతగా గుర్తింపు రాలేదు కానీ ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ తో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది దీంతో ఈమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.