
ఇదిలా ఉండగా తాజాగా ప్రభాకర్ తన కుటుంబంతో కలిసి అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నారు. ఇక్కడ తన భార్యతోపాటు కూతురు దివిజా కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అరుణాచల యాత్రకు సంబంధించిన ఫోటోలను దివిజా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇందులో మెడలో పూలమాల వేసుకొని చాలా ట్రెడిషనల్ గా కనిపించింది దివిజ. ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఏమని చూసినట్లయితే కామెంట్స్ పెడుతున్నారు.
ఇక దివిజ విషయానికి వస్తే.. ఇటీవల బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన బ్రహ్మ ఆనందం సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అంతేకాదు తన సోదరుడు చంద్రహాస్ నటించిన రామ్ నగర్ బన్నీ చిత్రానికి సహానిర్మాతగా కూడా వ్యవహరించింది. ఇక ప్రస్తుతం హే చికిత్తా సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా లాంఛనంగా ప్రారంభం అయింది. మొత్తానికైతే ఈ ఫోటోలలో దివిజా చాలా అందంగా, క్యూట్ గా కనిపిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం దివిజాకి సంబంధించిన ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా దివిజ ఇప్పుడు నిర్మాతగా అటు హీరోయిన్గా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి దివిజాకు సినీ ఇండస్ట్రీ ఏవిధంగా కలిసి వస్తుందో చూడాలి. అటు ప్రభాకర్ కూడా తన పిల్లలిద్దరిని ఇండస్ట్రీలో సెటిల్ చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు.