యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా .. అనసూయ, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా లీడ్ చేస్తున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ 2 ఇటీవలే ముగిసింది . గ్రాండ్ ఫినాలే లో అద్భుతంగా తమ నటనని ప్రదర్శించిన ఖిలాడీ గర్ల్స్ ఈ సీజన్ గెలిచారు. ఈ షో మొదటి సీజన్ కిర్రాక్ బాయ్స్ గెలవగా ఈసారి విజయాన్ని గర్ల్స్ గెలవడం జరిగింది. ముఖ్యంగా ఫినాలి లో ఎవరు ఎలా ఆడారు ?గెలిచిన వారికి వచ్చిన ప్రైజ్ మనీ ఎంత అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.


గ్రాండ్ ఫినాలే లో లాస్ట్ టాస్క్ ఆడటానికి బాయ్స్ నుంచి పాల్గొన్న ఇమ్మానుయేల్ , అర్జున్ అంబాటి ఉండగా.. గర్ల్స్ బ్యాచ్ నుంచి ప్రియాంక జైన్, తేజస్వి మదివాడ బరిలో దిగారు. కానీ చివరికి సెమీఫైనల్స్ లో గర్ల్స్ గ్యాంగ్ నుంచి ఒక పవర్ రావడంతో దాని ప్రకారం ఫినాలి లో జరిగేటువంటి టాస్క్ నుంచి అవతలి టీమ్ లో ఒక మెంబర్ని తప్పించవచ్చు.. ఈ పవర్ వాడుకొని స్ట్రాంగ్ ప్లేయర్ అయిన అర్జున్ ని గేమ్ నుంచి ప్లాన్ తోనే ఖిలాడీ గర్ల్స్ తప్పించారు. దీంతో వారికి విజయం అనుకూలంగా మారింది.


దీంతో ఇక చేసేదేమీ లేక అర్జున్ వెను తిరిగారు.అలా ఇమ్మానుయేల్ ఒక్కడే ఇద్దరు అమ్మాయిలతో పోటీ పడాల్సి వచ్చింది.. ఈ పోటీలో ఓడిపోయిన ఇమ్మానియేల్ చివరికి గర్ల్స్ గ్యాంగ్ గెలిచారు. దీంతో ఖిలాడి గర్ల్స్ గెలిచిన  తర్వాత 13 వారాలకు సాగిన ఈ షోకి ఖిలాడీ గర్ల్స్ కి రూ.6.25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు అలాగే కిరాక్ బాయ్స్ రూ.5.45 లక్షలు సాధించారు. టైటిల్ గెలిచిన గర్ల్స్ గ్యాంగ్ కి శేఖర్ మాస్టర్ రోపిని అందించడం జరిగింది.. అలాగే శేఖర్ మాస్టర్ అనసూయ ఇద్దరు కలిపి రూ .10 లక్షల రూపాయల ప్రైజ్ మనీని చెక్కుగా అందించారు. దీంతో ఇంత ప్రైజ్ మనీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: