జపనీస్ ఫేమస్ టూవీలర్ బ్రాండ్ యమహా ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న మాక్సీ-స్టైల్ స్కూటర్ ఏరోక్స్ 155 లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.యమహా మోటార్ ఇండియన్ మార్కెట్లో అందిస్తున్న ఇతర మాన్‌స్టర్ ఎనర్జీ యమహా మోటోజిపి ఎడిషన్ల లాగానే, కంపెనీ ఏరోక్స్ 155లో కూడా మోటోజిపి ఎడిషన్‌ను విడుదల చేసింది.యమహా  ఆగస్ట్ నెలలో తమ ప్రోడక్ట్ లైనప్‌లోని కొన్ని ఎంపిక చేసిన మోడళ్లలో కొత్త 2022 మోటోజిపి ఎడిషన్లను విడుదల చేసింది. వీటిలో RayZR స్కూటర్‌లతో పాటు R15M ఇంకా MT15 మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. కాగా, ఇప్పుడు ఈ జాబితాలోకి Areox 155 మాక్సీ స్కూటర్ కూడా వచ్చి చేరింది. ఈ యమహా మోటోజిపి ఎడిషన్ ఏరోక్స్ 155 స్కూటర్‌ని కంపెనీ  ప్రతిష్టాత్మక రేసింగ్ జట్టు అయిన టీమ్ బ్లూ  రేసింగ్ మోటార్‌సైకిళ్ల నుండి ప్రేరణ పొంది డిజైన్ చేయబడింది.ఈ కొత్త 2022 యమహా మోన్‌స్టర్ ఎనర్జీ మోటోజిపి ఎడిషన్ ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ దాని స్టాండర్డ్ మోడల్‌తో పోల్చితే, ఇది ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్ ని కలిగి ఉంటుంది. ఇందులో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఎలాంటి మెకానికల్ ఇంకా టెక్నికల్ అప్‌గ్రేడ్స్ లేవు.


ఇండియన్ మార్కెట్లో ఈ కొత్త 2022 యమహా ఏరోక్స్ 155 మోటోజిపి ఎడిషన్ ధర రూ. 1,41,300 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) గా ఉంది. కాగా, ఇందులో స్టాండర్డ్ యమహా ఏరోక్స్ 155 స్కూటర్ ధర రూ. 1,39,300 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) గా ఉంటుంది.ఈ స్పెషల్ ఎడిషన్ యమహా ఏరోక్స్ 155 స్కూటర్ చాలా వరకూ బ్లాక్ థీమ్‌ను కలిగి ఉండి, బాడీపై అక్కడక్కడా బ్లూ కలర్ హైలైట్స్ ఇంకా మోన్‌స్టర్ ఎనర్జీ బ్రాండ్ లోగోలను కలిగి ఉంటుంది. ఫ్రంట్ వైజర్, ఫ్రంట్ ఆప్రాన్, ఫ్రంట్ మడ్‌గార్డ్, సైడ్ ప్యానెల్‌లు ఇంకా అలాగే వెనుక ప్యానెల్‌లపై Yamaha MotoGP బ్రాండింగ్ ప్రధానంగా కనిపిస్తుంది. ఇది మాన్‌స్టర్ ఎనర్జీ యమహా మోటోజిపి ఎమ్1 మోటార్‌సైకిల్  కలర్ స్కీమ్ నుండి ప్రేరణ పొందింది.


ఇది రేస్ ట్రాక్ పై ఉపయోగించే పాపులర్ యమహా రేస్ మోటార్‌సైకిల్.యమహా ఏరోక్స్ 155 మోటోజిపి ఎడిషన్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఏమీ లేవు. యమహా ఆర్15 బైక్‌లో ఉపయోగించిన అదే 155సీసీ ఇంజన్‌ను కొద్దిగా రీట్యూన్ చేసి, దానికి సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జోడించి ఈ మాక్సీ స్కూటర్‌లో ఉపయోగించారు. ఇందులోని వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA)తో కూడిన కొత్త-తరం 155సీసీ బ్లూ కోర్, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి 4-వాల్వ్ ఇంజన్ మాక్సిమం 15.1 బిహెచ్‌పి పవర్ ని ఇంకా 13.9 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: