సాధారణం గా స్కూలు కాలేజీల్లో చదువుతున్న అబ్బాయిలు అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండడం చూస్తూ ఉంటాము. అయితే కొన్ని కొన్ని సార్లు మాట మాట పెరిగినప్పుడు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక స్కూలు కాలేజీలో ఇలా స్టూడెంట్స్ మధ్య గొడవలు చాలా సర్వసాధారణం గా జరుగుతూ ఉంటాయి. ఒకానొక సమయం లో ఇలా చిన్నచిన్న కారణాలతో కొట్టుకున్న వారు ఆ తర్వాత కలిసిపోయి స్నేహితులుగా మారి పోతూ ఉంటారు.


 అయితే అబ్బాయిలు ఇలా తరచూ గొడవ పడటం చూస్తూ ఉంటాం. కానీ అమ్మాయిలు మాత్రం గొడవల జోలికి అసలు పోరు. ఒకవేళ గొడవ పడిన కేవలం మాటలతో  మాత్రమే సరిపెట్టుకుంటారు. కానీ ఇటీవల కాలం లో మాత్రం కొంత మంది కాలేజీ అమ్మాయిలు గొడవల విషయం లో అబ్బాయిలను మించి పోతున్నారు. ఏకంగా విచక్షణ కోల్పోయి నడిరోడ్డుపై అందరూ చూస్తున్నారు అన్న విషయాన్ని కూడా మరిచి పోయి సిగపట్లు పట్టి మరి దారుణం గా కొట్టుకుంటూ ఉన్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయ్. ఇలాంటి వీడియోలు ట్విట్టర్లో వైరల్ గా మారి పోతున్నాయ్. ఇక ఇప్పుడు ఇలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది.


 డబ్ల్యూడబ్ల్యూఈ లో రెజ్లర్లు ఏ రేంజ్ లో ఫైట్ చేసుకుంటారో అందరికీ తెలిసే ఉంటుంది. ఇక ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన వీడియోలో కూడా అమ్మాయిలు డబ్ల్యడబ్ల్యుఈ రేంజ్ లో నడిరోడ్డుపై ఫైటింగ్ చేశారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. కింద మీద పడుతూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే పక్కనే ఉన్న అబ్బాయిలు ఈ గొడవను ఆపాల్సింది పోయి తెగ ఎంజాయ్ చేస్తూ ఇక గొడవ పడుతున్న అమ్మాయిలను ఎంకరేజ్ చేశారు అని చెప్పాలి. చివరికి అక్కడున్న మరో అమ్మాయి జోక్యం చేసుకొని ఫైటింగ్ ఆపేందుకు ప్రయత్నించినా కూడా ఇక ఆ ఇద్దరు అమ్మాయిలు మాత్రం అస్సలు వినలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: