సాధారణంగా రోడ్లపై చిన్న చిన్న గుంతలు ఉంటేనే వాహనదారులు గగ్గోలు పెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందరు ఇలాంటి గుంతలు మయమైన రహదారులలో ప్రయాణిస్తూ ఉంటే నడుము విరిగిపోతుంది అంటూ ప్రభుత్వం పై విమర్శలు చేయడం కూడా చూస్తూ ఉంటాము. ఇక అటు ప్రతిపక్షాలు కూడా ఇలా గుంతల మయంగా మారిన రోడ్లను కారణంగా చూపుతూ ఇక అధికార పక్షంపై విమర్శలు చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనీసం గుంతల మయంగా మారిన రోడ్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంటుంది అన్న విషయాన్ని అటు ప్రభుత్వం ఇటు ప్రతీ పక్షాలు కూడా మరిచిపోతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఒక ఊరు దాటి మరో ఊరికి వెళ్లాలి అంటే ప్రజలు ఇక ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకొని మరి ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఘటనల ద్వారా ప్రతి ఒక్కరికి అర్థం అవుతూ ఉంటుంది. శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జులకు పైనే ప్రయాణం చేస్తూ ఇక ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ ఉంటారు ఎంతోమంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.



 ఇక ఇదంతా చూస్తుంటే ఇదొక సాహస ప్రయాణంలా ప్రతి ఒక్కరికి అనిపించక మానదు అని చెప్పాలి. ఎందుకంటే ఒక వైపు నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇలాంటి సమయంలో కొందరు స్త్రీలు ఏకంగా చెట్టు పైకి ఎక్కి ఆ తర్వాత వంతెన మీదికి దిగి ఇక ఆ నది ప్రవాహాన్ని దాటడం చూడవచ్చు. ఏకంగా జుగాడు వంతెనను ఆశ్రయించి మహిళలు ఇలా నది ప్రవాహాన్ని ఒకవైపు నుంచి మరోవైపుకు దాటేస్తున్నారు అని చెప్పాలి. ఇక ఏమాత్రం పొరపాటు జరిగిన చివరికి నదిలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మహిళలకు వేరే దారి లేక ఇక ఇలాగే వంతెన దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: