
అయితే ఇది చాలా చాలా డేంజర్ అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మొబైల్ లైట్ ఆన్ చేసి దానిపై సీసపు గాజు పెట్టి అందులో కొన్ని నీరు పోసి స్పూన్ తో పసుపు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న రీల్ పై జ్యోతిష్య శాస్త్ర నిపుణులు షాకింగ్ కామెంట్స్ చేశారు . ఇలా పసుపుని నీటిలో కలపడం ప్రక్రియ దాదాపు మాయాజాలంలో ఉపయోగిస్తారు అని .. ఇది చాలా ప్రమాదకరమైన విధానం అని .. దీని ద్వారా నెగిటివ్ ఎనర్జీని ఇంటికి పిలిచినట్టే అని హెచ్చరిస్తున్నారు. పసుపు ని నీటిలో వేస్తే అది ఇంటిలోకి ప్రతికూల శక్తిని ప్రవేశించేలా చేస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు .
దెయ్యాలు .. ఆత్మలు అంటే నమ్మరు .. కానీ ప్రతికూల శక్తిలో ఇది ఒకటి . అందువలన ఈ మాయాజాల ప్రక్రియ వలన ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట . అందుకే ఈ రీల్ చేయకుండా ఉంటే బెటర్ అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు . అంతేకాదు ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ జాతకం పూర్తిగా అల్లకల్లోలంగా తయారైపోతుందట . చంద్రుడు - బృహస్పతిని బలహీన పరుస్తుందట . ఆ కారణంగా వాళ్ళ జీవితంపై చెడు ప్రభావం కూడా చూపిస్తుందట మానసిక స్థితి ఆర్థిక పరిస్థితిపై కూడా ఇది ప్రభావం చూపగలదు అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు . ఇది చాలా వరకు హానికరమైన ప్రక్రియ అని దీనికి దూరంగా ఉండటమే బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం పలువురు పండితులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలు మరికొన్ని సూచనల ద్వారా తెలిపిన అంశాలు మాత్రమే . వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అనే విషయం పాఠకులు గమనించాలి. దీనిని ఇండియా హెరాల్డ్ ధ్రువీకరించడం లేదు.