సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉంటారో.. ప్రసవం తరువాత కూడా అంతే జాగ్రత్త పడుతుండాలి. అయితే రెండు వారం నుండి పెల్విక్‌ ఫ్లోర్‌ ఎక్సర్‌ సైజ్‌లు చేస్తుండాలి. అంతేకాదు.. వెల్లకిలా పడుకుని మోకాళ్లు మడిచి పాదాలు మంచంపై అణుచుకోవాలి. ఇక మోకాళ్లు, తొడలు, పిరుదులు, నొక్కి పెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక మలద్వారం ముడవాలని చెప్పారు. అయితే ఈ విధంగా 5 సెకన్ల వరకు ఉండి రిలాక్స్‌ కావాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వెల్లకిలా పడుకుని ఒక మోకాలు మడవాలి. కడుపు కండరాలు బాగా లోపలికి లాక్కొని చాచి ఉన్న కాలుని కాళ్లవైపుకు బాగా చాచాలని తెలిపారు. ఇక తిరిగి ఇది మడిచి రెండవ కాలుని చాచాలని తెలిపారు. మళ్ళి రిలాక్స్‌ అవ్వాలని చెప్పారు. ఇక రోజుకి ఆలా  5-6 సార్లు చేస్తుండాలి.

అంతేకాదు.. కూర్చుని మోచేతుల్ని మెకాళ్లపై ఉంచి ఊపిరి వదులుతుండాలి. ఇక జననేంద్రియం, అనస్‌ ని లోపలికి ముడుచుకునేట్లు బిగపెట్టాలని చెప్పారు. ఇక మూత్ర విసర్జన చేసే ముందు కొంత సేపు బిగబట్టడం వల్ల కడుపులోని గ్యాస్‌ బయటికి వచ్చేస్తుంది. ఇక ఈ విధంగా ఒకటి నుంచి మూడు సెన్ల వరకు చేసి రిలాక్స్‌ అవ్వాలని చెబుతున్నారు. అంతేకాక.. కడుపుని ఎక్కువ సేపు లోపలికి ముడుచుకునేట్లు బిగపెట్టరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక పిరుదుల్ని కాని, కాళ్లని దగ్గరగా ఉంచి బిగపెట్టరాదని అన్నారు. అయితే బాలింతలకు ఇబ్బంది లేని విధంగా 5-6 సార్లు చేస్తుండాలి. ఇక కూర్చొని కాని, నిలబడి కాని, పడుకొని కాని చేయవచ్చునని అంటున్నారు. అయితే వెల్లకిలా పడుకొని నడుం భాగంపై కెత్తి ఇలా 30 సెకన్లు ఉంచాలని అన్నారు. ఇక మూత్రవిసర్జన, మలవిసర్జన చేసేటప్పుడు కొన్ని సెకన్లపాటు బిగపెట్టి వదలాలని తెలిపారు. అలాగే దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు మాత్రం చేయరాదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: