ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారతదేశంలోనే సహజంగా దొరికే ఇంధన రేట్లు అత్యధికం అని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టాక్స్ ద్వారా భారతీయులకు ఈ ఇంధన రేట్లు అమాంతం పెరుగుతున్నాయి. వీటిలో దృష్టిలో ఉంచుకొని భారతదేశంలోని ఆటోమొబైల్ రంగ సంస్థలు ఎలక్ట్రికల్ వాహనాలపై మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పై మాత్రమే కాకుండా కార్ల ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. జపాన్ దేశానికి చెందిన కియా మోటార్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో ఏకంగా ఒక పెద్ద సంస్థని ఏర్పాటు చేసి ఎలక్ట్రికల్ కార్లను పెద్ద సంఖ్యలో విడుదల చేస్తోంది.

 


అయితే కియా మోటార్స్ ద్వారా కూడా విడుదలైన కూడా కార్లలో కాస్త ఎక్కువ ధరలు ఉండడంతో మధ్య తరగతి ప్రజలు ఈ కార్లపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని చెప్పవచ్చు. అయితే కియా మోటార్స్ భారతదేశంలో మొట్టమొదటిగా విడుదల చేసిన suv కియా సెల్ టోస్. ఈ కారు వినియోగదారుల ఆకర్షించడంలో విజయవంతమైందని చెప్పవచ్చు. ఈ కారు అమ్మకాలలో అనేక కొత్త రికార్డులను కూడా సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ పాపులర్ కియా కార్ ఎలక్ట్రిక్ వర్షన్ లో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ తెలియజేసింది. అయితే ఈ సంవత్సరం చివరికల్లా అంతర్జాతీయ మార్కెట్లో ఈ కారును ఆవిష్కరించబోతున్నారు.

 


ఇకపోతే ఈ కార్ ముందుగా చైనా దేశం మార్కెట్లో విక్రయించే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాతనే మిగతా దేశాలలో ఈ కార్ విడుదల చేయవచ్చు. ఇందుకు సంబంధించి సెల్ టొస్ ఎలక్ట్రిక్ కార్ కొత్తతరం కియా కెఎక్స్ 3 గా మార్కెట్ లోకి విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ కారుకు సంబంధించి వివరాలు చూస్తే... 45.2 kw లిథియం అయాన్ బ్యాటరీ ని అమర్చ గా... 11 bhp శక్తిని విడుదల చేస్తూ, 285nm టార్క్ ను విడుదల చేయగలదు. ఇక ఈ బ్యాటరీని ఒకసారి పూర్తిగా రీఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.

 

 

అలాగే ఈ కార్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు. ఈ కార్ చైనా దేశంలో మూడు వేరియంట్స్ లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా బిఎస్ 6 ప్రమాణాలకు తగ్గట్టు మూడు ఇంజన్ ఆప్షన్లలో ఈ కార్ విక్రయించబోతున్నారు. మొదటిగా వీటిని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.4  టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్  లభ్యం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: