ఇక అలాగే మైలేజి ఎక్కువగా ఇచ్చే కార్లలో మంచి పర్ఫెక్ట్ కార్ డాట్సన్ రెడీ-గో. ఇది లీటరుకు గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుంది. అంతేకాకుండా 1.0-లీటర్ ఇంజిన్ ను కలిగి ఉండి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎక్స్ షోరూం ఈ సరికొత్త డాట్సన్ వాహనం ప్రారంభ ధర వచ్చేసి రూ.4.92 లక్షలుగా సంస్థ నిర్దేశించడం జరిగింది. అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికత, ప్రత్యేకతలను పొందుపరిచిన ఈ కారు వాహన ప్రియులను ఆకర్షిస్తోంది.ఇక మరో కార్ మారుతి సుజుకి డిజైర్ 1.2-లీటర్ డ్యూయల్ జెట్ యూనిట్ ఇంజిన్ ను కలిగి ఉంది. గతంలో కంటే మెరుగైన పవర్ ఔట్ పుట్ తో పాటు అత్యుత్తమ మైలేజినిచ్చేలా దీనిని డిజైన్ చేయ్యడం జరిగింది. ఈ సరికొత్త డిజైర్ మోడల్ లీటరుకు ఎక్కువగా 24.12 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. అంతేకాకుండా 88 హార్స్ పవర్ హెచ్ పీ, 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ 1.2-లీటర్ మోటార్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎక్స్ షోరూంలో ఈ వాహనం ధర వచ్చేసి రూ.7.41 లక్షల నుంచి రూ.8.90 లక్షలు పలుకుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి