ఇక వాహనాలకు ఖచ్చితంగా ఎయిర్ బాగ్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రయాణికులను ప్రాణాల నుంచి కాపాడతాయి.ఇక ఎనిమిది మంది వరకు ప్రయాణించే మోటారు వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయాలనే డ్రాఫ్ట్ GSR నోటిఫికేషన్‌ను ఆమోదించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు.

ఇక 2019 జూలై 1 నుంచి డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ఇంకా ఫ్రంట్ కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ల ఫిట్‌మెంట్‌ను ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని రోడ్డు రవాణా ఇంకా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఇప్పటికే ఆదేశించిందని గడ్కరీ గతంలో వరుస పోస్టులతో సోషల్ మీడియా ద్వారా తెలిపారు.వాహనం యొక్క ధర లేదా వేరియంట్‌తో సంబంధం అనేది లేకుండా అన్ని విభాగాలలో ప్రయాణీకుల సేఫ్టీని ఇది అంతిమంగా నిర్ధారిస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈ సంవత్సరం జనవరి 1 నుండి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి అయ్యాయి.

అయితే ఇది డ్రైవర్ ఇంకా ఫ్రంట్ కో-ప్యాసింజర్ యొక్క ఫ్రంటల్-ఇంపాక్ట్ భద్రత కోసం ఉద్దేశించబడింది. కొత్త వాహనాలకు సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే కొత్త నిబంధన, సైడ్ ఇంపాక్ట్‌ల విషయంలో కూడా ప్రయాణీకులకు భద్రతను అందిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రమాదకరంగా అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్న అగ్ర దేశాల్లో భారతదేశం కూడా ఒకటి.ఇక ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి రోజు కూడా చాలా భారీ సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయి.ఇంకా అలాగే ప్రయాణికులకు ప్రాణాంతకమైన తీవ్ర గాయాలు కూడా సంభవిస్తున్నాయి.ఇక ప్రమాదాల వెనుక ట్రాఫిక్ ఉల్లంఘనలు ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నప్పటికీ, తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఇంకా ముఖ్యంగా చిన్న ఎంట్రీ లెవెల్ వాహనాలు కూడా అనేక మరణాలకు కారణమవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: