తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలపై ఇవాళ జగన్ టీమ్ ఆయనకు బిగ్ షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటున్న బాలినేని.. కాల్ వాయిస్ రికార్డింగ్ జరిగిందన్నారు. కాల్ రికార్డింగ్ చేసిన కోటంరెడ్డి స్నేహితుడు భయపడి దాక్కున్నాడని.. ఫోన్ రికార్డు చేసిన వారితోనే రేపు మాట్లాడిస్తామని బాలినేని అంటున్నారు.

నిన్న సీఎం వైఎస్ జగన్ తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. వైసీపీ  ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ఆరోపనలపై చర్చించారు. తమ ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందన్న ఎమ్మెల్యేల ఆరోపణలపై జగన్తో చర్చించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై సీఎంతో చర్చించిన బాలినేని.. నెల్లూరు రూరల్ కు వైకాపా ఇన్ చార్జినుంచి కోటం రెడ్డిని తప్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలోనే నెల్లూరు రూరల్ వైకాపా కొత్త ఇన్ చార్జిని ప్రకటిస్తామన్న బాలినేని.. నెల్లూరులో జరిగిన అన్ని విషయాలను సీఎం జగన్ తో చర్చించానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: