ఏపీఎఫ్ఆర్ఎస్ ద్వారా ఫేస్‌ రిగక్నైజ్‌డ్‌ అటెండెన్స్‌కు ప్రత్యేక డ్రైవ్ లు పెట్టాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. మొబైల్ యాప్ ద్వారా 100 శాతం హజరు నమోదుకు అన్ని విభాగాల కార్యదర్శులు, విభాగాధిపతులు , జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా 100 శాతం హాజరు నమోదు కాకపోతే సంబంధిత శాఖలు, విభాగాల పాలనా అధికారులు, నోడల్ అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాలని ఆదేశాలు ఇచ్చింది.


ఫేస్‌ రిగక్నైజ్‌డ్‌ అటెండెన్స్‌ యాప్ ను తప్పనిసరి చేసినా చాలా మంది ఉద్యోగులు ఇంకా యాప్ డౌన్ లోడ్ చేసుకోలేదని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాల్లో పేర్కొంది. ఫేస్‌ రిగక్నైజ్‌డ్‌ అటెండెన్స్‌ యాప్ ను ప్రవేశపెట్టి నెలరోజులు గడుస్తున్నా వందశాతం ఫలితాలు రావటం లేదని..
ఏపీ ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు. 2023 జనవరి 1 తేదీ నుంచి రాష్ట్ర సచివాలయం, 2023 జనవరి 16 నుంచి ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో యాప్ ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: