మార్చి 21వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి నేడు  చరిత్ర లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 జోసెఫ్ ఫోరియర్ జననం : ఫ్రాన్స్ కి  చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త అయిన జోసెఫ్ ఫోరియర్ 1768 మార్చి 21వ తేదీన జన్మించారు. ఈయన ఫోరియర్ ట్రాన్స్ ఫార్మ్  ఫోరియర్స్  శ్రేణులను కనుగొన్న శాస్త్రవేత్త అందరికీ సుపరిచితుడు. వాతావరణంలో వాయువుల వల్ల భూమి ఉపరితలం పై ఉష్ణోగ్రత పెరగొచ్చు అన్న విషయాన్ని కనుగొన్న ఘనత జోసెఫ్ ఫోరియర్ కి 1824లో దక్కిందని చెప్పుకుంటారు. 

 

 మేక రంగయ్య అప్పారావు జననం : నూజివీడు జమిందార్  కుటుంబానికి చెందిన వారు ప్రముఖ విద్యావేత్త మాజీ మంత్రి,  మాజీ రాజ్యసభ సభ్యుడైన మేకా రంగయ్య అప్పారావు 1915 మార్చి 21వ తేదీన జన్మించారు. నూజివీడు శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా 1952,1957,62,67,72 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఇక నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కూడా కొంతకాలం ఆప్కారి శాఖ మంత్రివర్యులు గా సేవలు అందించారు. ఆ తర్వాత కాలంలో రాజ్యసభకు ఎన్నికయ్యారు మేకా రంగయ్య అప్పారావు. 1989లో ఒక్కసారి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి పాలడుగు వెంకట్రావు చేతిలో ఓడిపోయిన ఒక్కసారి తప్ప ఎప్పుడూ మేకా రంగయ్య అప్పారావు ఎన్నికల్లో ఓటమిని చవిచూడలేదు. అందుకే ఆయనకు రాజకీయాల్లో మంచి ప్రస్థానం ఉంది అంటారు. 

 

 మాతాజీ నిర్మలాదేవి జననం : సహజ రాజయోగ  సంస్థ ప్రారంభ కురాలైన భారత మహిళ మాతాజీ నిర్మలాదేవి 1923 మార్చి 21వ తేదీన జన్మించారు.

 

 మునిపల్లె రాజు జననం : భారత ప్రభుత్వ రక్షణ శాఖ లోని ఇంజనీరింగ్ సర్వీస్ లో ఉద్యోగం చేసిన వ్యక్తి మునిపల్లె రాజు. తెలుగు కథను సుసంపన్నం చేశారు ఆయన. ఈయన 1925 మార్చి 21వ తేదీన జన్మించారు. 

 

 

 పచ్చా రామచంద్రరావు జననం : ప్రపంచ ప్రఖ్యాత లోహ శాస్త్రజ్ఞులు అయినా పచ్చా రామచంద్రరావు 1942 మార్చి 21వ తేదీన జన్మించారు. 1992 నుంచి 2002 వరకు జంషెడ్ పూర్ లోని జాతీయ లోహ శాస్త్ర పరిశోధనల నిర్దేశకుడిగా పనిచేశాడు రామచంద్రరావు. ఇక పదవి విరమణ తరువాత హైదరాబాద్ లోనే అంతర్జాతీయ భాషాశాస్త్ర నూతనలోహ  పదార్థాలు పరిశోధన సంస్థలు రాజా రామన్న ఫెలో గా చేశాడు పచ్చ రామచంద్రమూర్తి. ఇక రామచంద్రరావు చేసిన పరిశోధనలు లోహ శాస్త్రం లో కొత్త పుంతలు తొక్కించారు అనే చెప్పాలి. ద్రవ  పదార్ధములలో త్వరితగతిన ఘనపదార్థాలు చేయు ప్రక్రియలు కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. 

 

 

 రాణి ముఖర్జీ జననం  : ప్రముఖ బాలీవుడ్ నటి... ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి రాణి ముఖర్జీ. 1978 మార్చి 21వ తేదీన జన్మించారు. 1998లో కుచ్ కుచ్ హోతాహై సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాణి ముఖర్జీ... నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది రాణి ముఖర్జీ. అంతే కాకుండా ఎప్పుడూ సామాజిక సమస్యలపై స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ మాట్లాడేవారు రాణి ముఖర్జీ. 

 

 

 శోభన జననం : సౌత్ ఇండియన్ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ శోభన 1970 మార్చి 21వ తేదీన జన్మించారు. స్వతహాగా భరతనాట్యం నేర్చుకున్నా శోభన ఎన్నో  సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.తమిళ మలయాళ సినిమాల్లో నటించారు. రజనీకాంత్ లాంటి పెద్ద హీరోల సినిమాల్లో కూడా నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు శోభన. 1984 ఏప్రిల్ 18వ తేదీన శోభన మొట్టమొదటి సినిమా హీరోయిన్ గా నటించింది. మలయాళంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి లాంటి హీరోల పక్కన కూడా నటించింది. .

మరింత సమాచారం తెలుసుకోండి: