ఇంధనశాఖ అనుమతితోనే స్మార్ట్ మీటర్లకు టెండర్లు పిలిచామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అంటున్నారు. స్మార్ట్ మీటర్లకు ఇప్పటికే 15 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయన్న  విజయానంద్‌.. 2025 నాటికి దేశవ్యాప్తంగా బిగించాలని కేంద్రం యోచనలో ఉందన్నారు. ఏపీలో  ఈ ఏడాది డిసెంబరు నాటికి తొలిదశ స్మార్ట్ మీటర్ల  బిగింపు పూర్తవుతుందన్న విజయానంద్‌..
తొలి దశలో నష్టాల తగ్గింపు ఉంటుందన్నారు.


స్మార్ట్ మీటర్లకు రూ.13,252 కోట్ల ఖర్చు అయ్యిందన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌.. విద్యుత్ నష్టాల తగ్గింపులో భాగంగా కొత్త ఫీడర్ల ఏర్పాటు చేశామన్నారు. కేంద్రం రూ.5,484 కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇస్తుందన్న విజయానంద్‌.. తొలిదశలో 27 లక్షల స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయించామన్నారు. 27 లక్షల్లో 4.72 లక్షల స్మార్ట్‌ మీటర్లే ఇళ్లకు కేటాయింపు ఉంటుందన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌.. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించడం లేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: