తెలంగాణలో మద్యం దుకాణాల కోసం ఇవాళ భారీగా దరఖాస్తులు దాఖలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాల కోసం దాదాపు 26వేలు అర్జీలు వచ్చినట్లు అబ్కారీ శాఖ నిన్న వెల్లడించింది. ఇవాళ్టితో అర్జీల స్వీకరణకు గడువు ముగియనుంది. చివరి రోజు అయ్యినందున 30వేలకుపైగా అర్జీలు వస్తాయని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 4వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం జరుగుతోంది. నిన్నటి వరకు దాదాపు 70వేలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మొన్నటి వరకు 44040 అర్జీలు రాగా నిన్న ఒక్కరోజే 25,925 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. నిన్నటి వరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 69965కు చేరింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1399 కోట్లు ఆదాయం వచ్చింది. 2021లో వచ్చిన 1357 కోట్లు కంటే ఇది ఎక్కువ. ఇవాళ అధికారుల అంచనా మేరకు 30వేల అర్జీలు రావచ్చు. అంటే మరో ఆరువందల కోట్లు రాబడి ప్రభుత్వానికి రావచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: