ప్రజలను పీడిస్తున్న కరోనా వైరస్ దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సందర్భంగా కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఆహార అవసరాలు, రోజువారీ అవసరకు సాయంగా రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపణ ప్యాకేజీను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసారు.  అందులో భాగంగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి మంచి శుభవార్త తెలిపింది. పీఎఫ్ విత్‌డ్రా రూల్స్‌ను సవరిస్తున్నట్లు నిర్మలా సీతారామన్  ప్రకటించారు.

 

 

ఇప్పుడు ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లు నేరుగా తమ పీఎఫ్ అకౌంట్ నుంచి ఏకంగా 75 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా వారి పీఎఫ్ ఖాతా అకౌంట్‌లో ఉండే మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారులకు ఇంకో శుభవార్త కూడా అందించింది. వచ్చే మూడు నెలల  పాటు పీఎఫ్ అకౌంట్ డబ్బులను కేంద్రమే భరించనుంది. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. 100 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతే కాకుండా, ఆ ఉద్యోగులలో 90 శాతం మందికి 15,000/- లోపు జీతం ఉండాలి. చిన్న ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే మరి.

 

 

మన దేశంలో ఎవ్వరూ కూడా ఆకలి బాధలు పడకూడదనే ఉద్దేశంతో నిర్మలా సీతారామన్ గరీబ్ క్యలాణ్ యోజన స్కీమ్‌ను ఆవిష్కరించారు. దీని కోసమే రూ.1.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. వలస కూలీలు, పేదలకు ఈ డబ్బు నేరుగా అకౌంట్లలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇలా జరిగితే చాల వరకు ఆకలి బాధలు తగ్గుతాయి. మోదీ సర్కార్ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పేదలు, కూలీలు ఆదాయం లేక ఇబ్బందులు పడకూడదని నిర్మలా సీతారామన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో చాలా తెలివిగా అలోచించి, ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చాలా మంది నిర్మలమ్మను ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: