ఒకప్పుడు వరిగడ్డి కొయ్యాలి అంటే , మనుషులతో కోయిచ్చేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మిషన్ తో  కోయించే పద్ధతి వచ్చింది. ఇక ఈ వరిగడ్డిని వృధా చేయకుండా,  దీనిని  అమ్మి డబ్బులు కూడా పొందవచ్చు. అయితే ఈ వరిగడ్డి ద్వారా మనము కూడా ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


ఒకప్పుడు ఎండు గడ్డిని మన పొలాల్లోనే వదిలేసే వాళ్ళం, కానీ ఇప్పుడు ఈ గడ్డి దొరికేదే చాలా కష్టంగా ఉంది. ఒక్కోసారి అధిక ధర చెల్లించి తీసుకోవాల్సి వస్తుంది మనకు. అయితే కొన్ని రాష్ట్రాలలో మాత్రం గడ్డి కొరత చాలానే ఉందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా కొన్ని రాష్ట్రాలలో ఈ ఎండు గడ్డిని కాల్చి బూడిద చేస్తున్నారు. అలా చేయడం వల్ల గాలి కాలుష్యం చాలా ఏర్పడుతుంది.



అలా తగల బెట్టుకోకుండా వాటితో గడ్డి బేళ్లను తయారు చేయడం ద్వారా మనం ఆదాయాన్ని పొందవచ్చు. వాటిని చిన్న చిన్న పరిశ్రమలకు ఎకరాకు 1000 రూపాయల చొప్పున అమ్ముకునే విధంగా వీలు ఉంటుంది. ఇక అంతే కాకుండా ఇటువంటి దానికి ఒక సపరేట్ ట్రాక్టర్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక దానికి కూడా ఎకరాకు 800-1000 రూపాయల వరకు చెల్లించవలసి ఉంటుంది.

ఇలా ప్రతిరోజు కనీసం 8 లేదా 9 గంటలపాటు పని చేసుకున్న ఎడల, ప్రతిరోజు 8000 రూపాయలు రాగా ఇక నెల తిరిగే సరికి దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు ఆదాయం చేసుకోవచ్చు. ఈ కాలంలో సులభంగా ఏదీ రాదు కష్టపడితేనే అందుకు తగిన ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పని చేయడం వల్ల మంచి ఆదాయం రావడంతో పాటు సకాలంలో పరిశ్రమలకు గడ్డిని అందించిన వాళ్లమవుతాం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టి , అతి తక్కువ సమయంలోనే లక్షల రూపాయల ఆదాయాన్ని పొందండి.


మరింత సమాచారం తెలుసుకోండి: