అమెరికా రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత గౌతమ్ అదానీకి చాలా పెద్ద నష్టం అనేది జరిగింది. ఇంకా ఈ నివేదిక రాకముందు ప్రపంచ సంపన్నుల లిస్టులో నాలుగో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఇప్పుడు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లోని టాప్-10 బిలియనీర్ల లిస్టులో 11వ ప్లేస్ కి చేరుకున్నారు.గౌతమ్ అదానీ సంపద ఏకంగా 36.1 బిలియన్ డాలర్లు తగ్గి ఇప్పుడు మొత్తం 84.21 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇంకా అలాగే రిలయన్స్ చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ ఈ లిస్టులో 12వ స్థానంలో ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల మధ్య ఒక స్థానం మాత్రమే తేడా ఉంది.ఇక బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ లిస్టులో బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి స్థానంలో ఉన్నారు. ఇతని మొత్తం ఆస్తులు ఏకంగా 189 బిలియన్ డాలర్లు. ఇతని తరువాత ఎలోన్ మస్క్ రెండవ స్థానంలో ఉన్నారు. అతని మొత్తం ఆస్తులు మొత్తం $ 160 బిలియన్లుగా ఉంది. ఆ తరువాత జెఫ్ బెజోస్ మూడవ స్థానంలో ఉన్నారు. అతని ఆస్తులు మొత్తం $ 124 బిలియన్లు. ఆ తరువాత బిల్ గేట్స్ 111 బిలియన్ డాలర్ల నికర విలువతో లిస్టులో నాలుగవ స్థానంలో ఉన్నారు.ఆ తరువాత వారెన్ బఫెట్ ఐదవ స్థానంలో ఉన్నాడు.


అతని మొత్తం ఆస్తుల విలువ $ 107 బిలియన్లు.ఇక లారీ ఎల్లిసన్  $99.5 బిలియన్లతో ఆరవ స్థానంలో ఉన్నారు. తరువాత లారీ పేజ్ ఏడవ స్థానంలో ఉన్నాడు. ఇతని మొత్తం నికర విలువ $90 బిలియన్లుగా చెప్పబడింది.తరువాత స్టీవ్ బాల్మెర్ మొత్తం $86.9 బిలియన్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇంకా సెర్జీ బ్రిన్ $86.4 బిలియన్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇతని తరువాత కార్లోస్ స్లిమ్ మొత్తం 85.4 బిలియన్ డాలర్లతో పదో స్థానంలో ఉన్నారు.అయితే ఇక ఈ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో గౌతమ్‌ అదానీ 11వ స్థానంలో ఉన్నట్లు చూపించిప్పటికీ.. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ లిస్టులో మాత్రం ఆయన 8వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. భారీ మొత్తంలో సంపదని కోల్పోయిన ఆదానీ.. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో కేవలం 11వ స్థానంలో నిలిచారు. మంగళవారం నాడు సెషన్‌లో కూడా ఆదానీ స్టాక్స్‌లో భారీ నష్టాలు కనుక కొనసాగితే ఆసియాలో కూడా అత్యంత సంపన్నుడిగా ఉన్న స్థానాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: