హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి మదుసూదన్ రెడ్డి కిడ్నాప్  చేసి మరీ హత్య కు పాల్పడ్డారు. ఈ ఘటన ఈ నెల 19 న చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యాపారి మధుసూదన్‌ రెడ్డి... తన మిత్రులే హత్య చేయడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్‌ గా మారింది.  నెల 19 నుంచి మధుసూదన్‌ రెడ్డి కనిపించక పోవడంతో  హైదరాబాద్‌ కర్మన్ ఘాట్ లో నివాసముండే అతని కుటుంబ సభ్యులు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..దీంతో కేసు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంతో మధుసూదన్ రెడ్డి హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.    సంగారెడ్డి జిల్లా కొహీర్ మండలం దిగ్వాల్ గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన మదుసూదన్ రెడ్డి  శవాన్ని  పోలీసులు వెలికి తీశారు. 

పోలీసులు వివరాల ప్రకారం...   ఈ కేసులో జగన్ నాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సౌత్ జోన్ పోలీసులు. ఈ నెల 19 చార్మినార్ లోని సంజీవ్ అనే వ్యక్తి ఇంటికి వచ్చాడు మధుసూదన్ రెడ్డి..ఆ తర్వాత అక్కడి నుంచి మధుసూదన్ రెడ్డి, సంజీవ్, గిరీష్, జగన్ నాథ్ కారులో సంగారెడ్డి వెళ్లారు. మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులకు మధుసూదన్ కిడ్నాప్ చేశామని సమాచారం ఇచ్చాడు జగన్నాథ అనే వ్యక్తి.  అటు సంజీవ్, గిరీష్ ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. డబ్బుల విషయంలో మధుసూదన్ రెడ్డి ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.  అటు పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు సౌత్ జోన్ పోలీసులు.

ఆర్థిక లావాదేవీల్లో కారణంగా మధుసూదన్ రెడ్డి ని సంజీవ్ హతమార్చినట్లు తెలుస్తోంది. ఓ  వివాదంలో గతంలో ఒక్కరిని హత్య చేసి  మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లాడు. అయితే... జైల్లో కర్ణాటక కు చెందిన సంజీవ్  పరిచయమయ్యాడు. జైలు నిండి విడుదల  అనంతరం ఇద్దరు కలిసి హైదరాబాద్ లో వ్యాపారం చేశారు. ఈ నేపథ్యం లోనే మధుసూదన్ రెడ్డి కి రూ. 40 లక్షలు బాకీ పడ్డాడు సంజీవ్. అయితే.. ఆ డబ్బులను మధుసుధన్‌ పదే పదే తిరిగి ఇవ్వమనడంతో...  హత్యకు ప్లాన్‌ చేశాడు సంజీవ్‌.  ఈ నేపథ్యంలో కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం జగన్నాథ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.  ఈ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: