రోజురోజుకీ టెక్నాలజీ లో ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ప్రతి మనిషి కూడా టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు. ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే  నేటి రోజుల్లో సోషల్ మీడియాను ఉపయోగించి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ చివరికి ఎన్నో వినూత్నమైన ప్రయత్నాలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. కొంతమంది సోషల్ మీడియా లో చూసి నేరాలు చేయడం ఎలా అనే విషయాలు నేర్చుకుంటూ ఉంటే.. మరి కొంతమంది సోషల్ మీడియా లో చూసి ఏవో చెత్త ప్రయోగాలు చేస్తూ ఉన్నారు.


 హుషారు సినిమాలో కొంతమంది ఏకంగా యూట్యూబ్ లో చూసి బీర్ తయారు చేయడం ఎలా అని నేర్చుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.  ఇక ఇటీవల నిజజీవితంలో కూడా ఇలాంటి జరిగిందని తెలుస్తోంది. అతని వయసు 12 ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ ఆ బుడ్డోడు యూట్యూబ్ లో చూసి లిక్కర్ తయారు చేయడం ఎలా నేర్చుకున్నాడు. ఇంకేముంది ద్రాక్ష పళ్ళ ను ఉపయోగించి లిక్కర్ తయారు చేశాడు.. అయితే అతను చేసిన ఈ ప్రయోగాన్ని అతని స్నేహితుడు మీద ప్రయోగించాడు. బాలుడు తయారుచేసిన లిక్కర్ స్నేహితుడితో తాగించగా అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.


 అప్పటికే అతనికి తీవ్రమైన వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురికావడంతో చివరికి ఆసుపత్రిలో చేర్పించవలసిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో వెలుగులోకి వచ్చింది. ఇలా  ఫీజు లిక్కర్ తాగిన బాలూడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే  యూట్యూబ్ లో చూసి బాలుడు తయారు చేసిన లిక్కర్ ను పర్మిషన్ తీసుకుని టెస్టింగ్ ల్యాబ్ కి పంపించారు అధికారులు. ఆ బాలుడు తయారుచేసిన లిక్కర్ లో ఆల్కహాల్ కాకుండా వేరే రసాయనాలు ఏమైనా మిక్స్ చేసినట్లు తెలిస్తే కేస్ ఫైల్ చేస్తామని వెల్లడించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: