
వివరాల్లొకి వెళితే..రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల16న ఓ వంతెన కింద గోనె సంచిలో యువతి మృతదేహం అందరినీ కలచివేస్తుంది.. విషయాన్నికొస్తే..స్థానికంగా ఉండే ఓ యువతి డబ్బున్న వ్యక్తులను టార్గెట్ చేసుకుని, వారి ఇంట్లోని పిల్లలకు ట్యూషన్ టీచర్ గా పని చెస్తుంది.. తన అందం తో ఎరగా వేస్తుంది.పిల్లల తండ్రులకు తన అందాలతో వల వేసేంది. తన మత్తులో మెల్లగా దించుతుంది. అంతేకాదు, వాళ్ళు పూర్తిగా దిగిన తర్వాత బ్లాక్ మెయిల్ కు దిగుతుంది.
ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ వ్యాపార వేత్తకు వల వేసింది. స్థానిక వ్యాపారవేత్త కపిల్ గుప్తా ఇంటికి వెళ్లి పిల్లలకు ప్రైవేట్ పాఠాలు చెప్తుండేది. అలా తన అందాలతో ట్రాప్ చేసింది. అతనితో సంబంధం పెట్టుకుంది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత తన అసలు రూపాన్ని బయట పెడుతోంది.కపిల్‌ను బ్లాక్‌మెయిలింగ్ చేసింది. తనకు పెళ్లి కుదిరిందని, రూ.50 లక్షలు కట్నం ఇవ్వాలని సదరు వ్యాపారవేత్తపై ఒత్తిడి చేయడం స్టార్ట్ చేసింది. ఆమె ఒత్తిడి ఎక్కువ అవ్వడం తో అతను భార్యకు, ఆమె సోదరులకు ఆ విషయాన్ని చెప్పారు. డబ్బులు ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్ళి చంపేశారు.ఓ గోనె సంచిలో కుక్కి తాతర్‌పూర్ బ్రిడ్జి కింద పడేశారు.. పోలీసులకు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు.. నిందిథులను అదుపులొకి తీసుకొని విచారణ చేపట్టారు.. ఇలా ఆమె చాలా మందిని ట్రాప్ చెసిందని తేలింది.