
సమైక్యాంధ్ర నేతలు తెలంగాణకు సహకరిస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేశారని విజయశాంతి ఫ్లాష్‌బ్యాక్ గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ అంశం వల్ల భాజపా ప్రభుత్వం కూలిపోవద్దని పార్టీకి రాజీనామా విజయశాంతి చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రకటన రేపు రాబోతుందని తెలుసు కేసీఆర్ ముందు రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేశారని విజయశాంతి ఆరోపించారు.
తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కాలేదని విజయశాంతి అంటున్నారు. ఇప్పుడు తప్పుడు మనిషి చేతిలోకి తెలంగాణ వెళ్లడం బాధ కలిగిందని విజయశాంతి అంటున్నారు. తెలంగాణ పేరుతో వచ్చి కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని విజయశాంతి దుయ్యబట్టారు. ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల మేలు కోసం పని చేస్తానని విజయశాంతి స్పష్టం చేశారు.
ఎవరికీ తలవంచకుండా విజయశాంతి పనిచేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. విజయశాంతి భాజపాలోనే 50 ఏళ్ల ప్రస్తానాన్ని పూర్తి చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకు విజయశాంతి ఎంతో పోరాటం చేస్తున్నారని ఆ పార్టీ నేత తరుణ్ చుగ్ కొనియాడారు. అయితే ఈ పాతికేళ్లలో రాములమ్మ సాధించిందేమిట ఆలోచిస్తే మాత్రం అంత సంతృప్తి కరంగా లేదు. ఏదో ఉన్నానంటే ఉంది తప్ప తన ముద్ర మాత్రం కనిపించడం లేదు. మరి ఇకకైనా రాములమ్మ తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా చాటుతుందా.. చూడాలి.