అన్ని అరబ్ దేశాలు పాక్ చెప్పినట్లు నడుచుకోవాలని మా వద్ద అణ్వయుధాలు ఉన్నాయని గొప్పలకు పోయేది పాకిస్తాన్. దీంతో సౌదీ అరేబియా మేం ఇచ్చే డబ్బులతో బతుకుతూ మా పైనే అజామాయిషీ చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఆ తర్వాత టర్కీ, పాకిస్థాన్ కలిసి అరబ్ దేశాల్లో చీలికలు తేవాలని ప్రయత్నించాయి.  దీంతో మరో సారి ఆగ్రహం చెందిన సౌదీ టర్కీని కూడా దూరంగా పెట్టింది.


సౌదీ అరేబియా భారత్ తో  స్నేహబంధాన్ని కొనసాగిస్తున్న సమయంలో పాకిస్థాన్ ప్రధాని షాబాద్ షరీప్ కశ్మీర్ అంశాన్ని మాట్లాడమని చాలా సార్లు సౌదీని అడిగారు. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఆయా దేశాలు అడగలేదు. అరబ్ దేశాల్లో ఎక్కడైనా పెద్ద ఈవెంట్లు జరిగితే పాక్ సైనికులే కాపలా కాసేవారు. అరబ్ దేశాల్లో సైన్యానికి కూడా శిక్షణ పాక్ సైనికులే ఇచ్చేవారు.


ఇప్పుడు భారత్ కు సౌదీ అరేబియా తమ సైనికులను పంపి శిక్షణ ఇప్పించుకుంటుంది. దీంతో పాక్ కు ఏం చేయాలో తోచడం లేదు. సౌదీ ప్రస్తుతం రాయల్ సౌదీ ల్యాండ్ పోర్సెస్ కు చెందిన ఆరుగురు ఇండియా ఆర్మీ వద్ద శిక్షణ తీసుకోవడానికి వచ్చారు. ప్రస్తుతం వీరు భారత సైనిక శిక్షణ విధానాన్ని తెలుసుకోవడంతో పాటు ఇక్కడ సైనికులకు ఎలా శిక్షణ ఇస్తారు తదితర విషయాలను వారు తెలుసుకోనున్నారు.


ఇప్పటివరకు సౌదీ కానీ అరబ్ దేశాలు గానీ పాకిస్థాన్ వద్ద ఆర్మీ శిక్షణ తీసుకునేవి. ఇలా ఒక అరబ్ కంట్రీ పాకిస్థాన్ కాకుండా ఇండియా వద్ద ఆర్మీ శిక్షణ పొందడానికి రావడం అరుదు. దీనిపై పాకిస్థాన్ కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సౌదీ పాకిస్థాన్ కంటే ఇండియాకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం చూసి తట్టుకోలేకపోతుంది. సౌదీ, భారత్ బంధం బలపడితే అది మనకు ఎంతైనా లాభమే.. కొన్ని లక్షల మంది భారతీయులు సౌదీలో ఉపాధి పొందుతున్నారు. వారికి కూడా కొంత వరకు ఇది మేలు చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: