సర్వేలు కూడా ఆయన వైపే ఉండడంతో ఎంపీగా గెలిచారు ఆయన. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత నుండి రఘురామ కృష్ణంరాజు మళ్ళీ జగన్ ను విమర్శించడం మొదలు పెట్టారు. అయితే ఆయనకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్న జగన్ కు రఘు రామ కృష్ణంరాజు పెద్ద షాకే ఇచ్చారట. రఘురామకృష్ణంరాజు వైసిపి ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. జగన్ కి వ్యతిరేకంగా విపక్షాలను కలపడంలో కూడా రఘురామ కృష్ణంరాజు సక్సెస్ అయ్యారని తెలుస్తుంది.
తన లెక్క ప్రకారం బిజెపి ఇంకా జనసేనతో తెలుగుదేశం కనుక కలిసి సాగేలా ఉంటే తాను నర్సాపురంలో పోటీ చేస్తే, నాగబాబుని నరసాపురం దగ్గరలో, ఇంకా భీమవరంలో పవన్ కళ్యాణ్ తో పోటీ చేయిద్దాం అనేది ఆయన స్కెచ్. వాళ్ళిద్దరు ఇంపాక్ట్తో తాను ఈజీగా గెలిచేయచ్చని రఘురామ కృష్ణంరాజు మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు దూకుడుకు చెక్ పెట్టేందుకు జగన్ నరసాపురంలో అంతా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఇంతకీ జగన్ వేసే ఆ ప్లాన్ ఏంటంటే నరసాపురంలో కృష్ణంరాజు ఇదివరకు మూడుసార్లు గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరణానంతరం ఆయన సతీమణి శ్యామలాదేవి గారిని వైసీపీ తరఫున పోటీ చేయమని అడుగుదామని జగన్ ఆలోచన అన్నట్లుగా తెలుస్తుంది. అలా చేస్తే గనుక ఇటు కృష్ణంరాజు చనిపోయిన సానుభూతి ఎలాగూ ఉంటుంది కాబట్టి జగన్ స్కెచ్ పని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభాస్ కూడా ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి