గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు టెక్ మహీంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తోంది. ఈ మేరకు హెచ్ సీహెచ్ బ్ల్యు సంస్థ ప్రతినిధి
శ్రీధర్ ఒక ప్రకటన వెలువరించారు. దీని ప్రకారం 18-27 ఏళ్ల మధ్య వయసు కల్గి ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు, అనుత్తీర్ణులకు ఫ్రీగా కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారు.

 

కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్ 2010, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్, ఇంగ్లిష్ టైపింగ్, బీకాం ఉత్తీర్ణులైన వారికి ట్యాలీ ఈఆర్ 9, బేసిక్ అక్కౌంట్స్, జీఎస్టీ, అడ్వాన్స్ ఎంఎస్ ఎక్సెల్, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ తదితర కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు.

 

శిక్షణ ఇచ్చిన తర్వాత ఉపాధి అవకాశాల పైనా అవగాహన కల్పిస్తారు. దీనిపై ఆసక్తి గల వారు 76749 85461, 70935 52020 నంబర్లు ద్వారా డిసెంబరు 5లోగా పేర్లు నమోదు చేయించుకోవాలని శ్రీధర్ చెబుతున్నారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఓకే. లేకుంటే ఇతరులకు ఫార్వార్డ్ చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: