వెల్లుల్లితో కొన్ని కోట్ల లాభాలు వున్నాయి. దీన్ని ఉపయోగించడం వల్ల మతిమరుపు ఇంకా అలాగే అల్జీమర్స్ వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి.ఇంకా రక్తపోటు అదుపులో ఉంటుంది.శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. అలాగే ఈ వెల్లుల్లికి రక్తాన్ని పలుచగా చేసే గుణం కూడా ఉంది. వెల్లుల్లిని విరివిరిగా ఉపయోగించడం వల్ల గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది.ఇక వెల్లుల్లి రెబ్బలకు ఉప్పును కలిపి వాటిని కచ్చా పచ్చాగా దంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని దెబ్బల వల్ల కలిగిన వాపులపై ఉంచి అలాగే కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల దెబ్బల వల్ల కలిగిన వాపులు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. అలాగే నువ్వుల నూనె లేదా ఆవ నూనెను 4 టీ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసి నూనెను వేడి చేయాలి. ఆ నూనె చల్లారిన తరువాత దీనిని ఒకటి లేదా రెండు చుక్కల మోతాదులో చెవిలో వేయడం వల్ల చెవి పోటు సమస్య కూడా తగ్గుతుంది.


అదే విధంగా వెల్లుల్లిని, సున్నాన్ని ఇంకా పసుపును కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని ఎముకలు బెణికిన చోట ఉంచి కట్టు కట్టడం వల్ల నొప్పి ఈజీగా తగ్గుతుంది.వెల్లుల్లి రసాన్ని రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి. ఆ తరువాత ఒక గ్లాస్ పండ్ల రసాన్ని కూడా తాగాలి. ఇలా రోజుకు 5 సార్లు తీసుకోవడం వల్ల టైఫాయిడ్ జ్వరం చాలా ఈజీగా తగ్గు ముఖం పడుతుంది. ఇంకా అలాగే వెల్లుల్లిని రోజూ ఉదయం పూట పరగడుపున నమిలి తినడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇక వీటిని నేరుగా తినలేని వారు తేనెతో కలిపి తినవచ్చు లేదా వాటి నుండి రసాన్ని తీసుకుని కూడా తాగవచ్చు. ఈ విధంగా మన వంటగదిలో ఉండే వెల్లుల్లి మనకు చాలా ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం చాలా రకాలం అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: