గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మార్చి 28వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ప్ర‌ముఖుల జననాలు

1868: మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత.
1904: చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు.. అతను ధరించిన పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు బహుళ ప్రజాదరణ పొందాయి. దక్షిణభారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు నాగయ్య. 336 కి పైగా సినిమాల్లో నటించాడు. 1938 లో వచ్చిన గృహలక్ష్మి చిత్రంతో అతను సినీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది
1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (మ.1990)
1923: జిల్లెళ్ళమూడి అమ్మ, ఈవిడ వేదాంత సూత్రం, ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు. ఈవిడ 1960-70 లలో చాలా ప్రసిద్ధురాలు.జిల్లెళ్ళమూడిలో నిరంతరం అన్నదానకార్యక్రమం జరిగే ఆలయం.1958 ఆగస్టు 15 న అమ్మ తన స్వహస్తాలతో అన్నపూర్ణాలయం ప్రారంభించారు. అప్పటి నుంచి నిరంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. పేద, గోప్ప, కులం, మతం అనే తేడా లేకుండా ఎంత మంది వచ్చిన ఎప్పుడొచ్చినా అక్కడ భోజనం వడ్డిస్తారు. 1958 లో అన్నపూర్ణాలయం ప్రారంభించక ముందు నుంచే అక్కడ ఈ కార్యక్రమం జరిగేది.

ప్ర‌ముఖుల మరణాలు..

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ . (జ.1504)
1933: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు.(జ.1860)
1959: కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (జ.1900)
1962: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (జ.1891)
2003: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (జ.1921)కమ్యూనిస్టు పార్టీ యొక్క అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగాను, పాలిట్‌బ్యూరో సభ్యునిగానూ, కేంద్రకమిటీ సభ్యునిగాను అనేక పర్యాయాలు పనిచేశాడు. ఈయన గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కాప్ర గ్రామంలో 1921, ఆగస్టు 3 న సుబ్రహ్మణ్యం, లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించాడు.
2006: వేథాత్రి మహర్షి, భారత తత్వవేత్త (జ.1911)

మరింత సమాచారం తెలుసుకోండి: