
పిల్లవాణ్ణి ప్రేమ పూర్వకంగా పెంచటం అంటే అతనికి అడిగినదల్లా ఇవ్వటమే అని చాలా మంది అనుకుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీ పిల్లలకు అడిగిందల్లా ఇస్తే రేపు మీ అంతస్థుకు తగని వస్తువు అడుగుతాడు. అప్పుడు ఏమి చేస్తారు..?? అందుకనే మీ పిల్లవాణ్ణి కొంచెం విజ్ఞతతో పెంచండి. అప్పుడు అతడు అడిగినదల్లా తెచ్చి ఇవ్వటం ఒట్టి మూర్ఖత్వమే అని మీకు తెలుస్తుంది.
అలాగే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీ ఇంట్లో ప్రేమాదరణలతో నిండిన వాతావరణాన్ని కల్పించటమే మీ పని. ఆ ఒక్కటి ఖచ్చితంగా చూసుకోండి మీరు. కోపంగా ఉండటం అంటే ఏమిటో, దీనంగా ఉండటం అంటే ఏమిటో, ఏడవడం అంటే ఏమిటో, మీ పిల్లలు ఎప్పటికీ చూడకూడదు. మీ ఇల్లు ప్రేమానందాలతో నిండి ఉండేలా చూడండి. ఇక వారు అద్భుతంగా పెరుగుతారు.ఎటువంటి పరిస్థితులను అయిన తట్టుకునేలాగా వాళ్ళు ఉల్లాసవంతంగా జీవించ గలగాలి. ఆ రకంగా వాళ్ళను పెంచండి. వాళ్ళు పెరగవలసిన తీరు అదే..మీ పిల్లవాని చుట్టూ ప్రశాంతవంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి.అలాగే పిల్లలను ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా సాన్నిహిత్యంగా ఉండేలాగా చూసుకోండి.