ఓ పుత్రుడి గాఢపరిష్వంగం ఇచ్చేంత హాయి ఈ ప్రపంచంలో ఏదీ ఇవ్వలేదని ఓ పురాణగాధలో పూర్వీకులు చెప్పారు. పిల్లలపై మమకారం అలాంటింది. అయితే మన వారసులుగా పిల్లలను ఎలా పెంచాలి.. వారి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలి.. ఈ విషయంపై అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

 

 

మొక్కైవంగనిది మానై వంగుతుందా అంటారు.. అలాగే పిల్లలను చిన్నానాటి నుంచే క్రమశిక్షణగా పెంచాలంటారు కొందరు. ఈ విషయంలో ఓ పురాణ శ్లోకం చెప్పుకోవాలి. ఇది పిల్లలను ఎలా పెంచాలో నాలుగు ముక్కల్లో అద్భుతంగా చెప్పేసింది. ఆ శ్లోకం ఓసారి చూద్దాం..

 

రాజవత్‌ పంచవర్షాణి | దశ వర్షాణి దాసవత్‌ |

ప్రాప్తే తు షోడశే వర్షే | పుత్రం మిత్రవదాచరేత్‌ ||

 

రాజవత్‌ పంచవర్షాణి’ అంటే పిల్లల్ని అయిదేళ్లవరకు రాజ మర్యాదలతో పెంచాలి. పదేళ్లు వచ్చే వరకు దాసులుగా పెంచాలి. పదహారేళ్ల నుంచి మిత్రులుగా చూడాలి.. అన్నది ఈ శ్లోకం అర్థం. లాలయేత్‌ పంచవర్షాణి” అని పాఠాంతరం ఉన్నది.

 

 

అయిదేండ్ల వయసు వచ్చు వరకు పిల్లవానిని బుజ్జగించాలి. ఈ శ్లోకంలో పుత్రం అంటూ చెప్పినా.. ఇది పుత్రుడు, పుత్రికలు ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ కాలంలో పుత్రికలు, పుత్రులు అంటూ తేడా ఏముంది చెప్పండి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: