
అయితే ఇల్లు చిందరవందరంగా ఉంది అంటే మనసంతా ఏదో చిరాకుగా ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది . ఇల్లు శుభ్రంగా ఉంటే మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది . ఇది మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉండటం. సమయం లేక విడిచేసిన బట్టలు వాషింగ్ మెషిన్ కి వేసిన బట్టలు మంచం పైన వేయడం.. లేదంటే సోఫాలో వేసేయడం కావాల్సినప్పుడు ఆ బట్టలలో నుంచి మనకు కావాల్సిన బట్టలు తీసుకొని వేసుకోవడం లాంటివి చూస్తూ ఉంటారు .
సర్ది బీరువాలో పెట్టే టైం లేక ఇలా బిజీబిజీగా ముందుకు వెళుతూ ఉంటారు . అయితే అది చాలా చాలా దరిద్రం అంటున్నారు జ్యోతిష్య పండితులు . ఇంట్లోని వస్తువులు ఎక్కడపడితే అక్కడ చిందరవందరిగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండనే ఉండదు అంటున్నారు జ్యోతిష్య పండితులు . అంతేకాదు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా విడిచేసిన బట్టలు కుప్పలు తెప్పలుగా ఎక్కడపడితే అక్కడ ఉండడం ఇంటికి దరిద్రమని ..అలా అస్సలు చేయకూడదు అని హెచ్చరిస్తున్నారు. కొంచెం ఓపిక చేసుకొని టైం అడ్జస్ట్ చేసుకొని ఎప్పుడు బట్టలు అప్పుడే మడత పెట్టుకొని చక్కగా సర్దుకుంటూ ఇల్లును చూడ చక్కగా ఆకర్షణీయంగా సర్దుకుంటే ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీతో పాటు లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు.
హిందూ సాంప్రదాయ ప్రకారం కూడా ఇల్లు చిందరవందర గా ఉండకూడదు . అలా ఉంటే అక్కడ పురుగులు చేరుతాయి . అదేవిధంగా డస్ట్ చేరుతుంది. ఆరోగ్యానికి హాని కలిగించే క్రిములు కూడా ఎక్కువగా చేరుతాయి. ఆ కారణంగానే గిన్నెలు తోముకున్న తర్వాత లేదా బట్టలు ఉతికిన తర్వాత ఎక్కడవి అక్కడ మడత పెట్టుకొని సర్దుకుంటే ఇల్లు చూడ చక్కగా ఉంటుంది . ఆకర్షణీయంగా ఉంటుంది . నలుగురు ఇంటికి వచ్చినా కూడా ఆ ఇంటి ఇల్లాలని పొగిడేస్తూ ఉంటారు . ఒకవేళ ఎక్కడ చెత్త అక్కడే వేసి పేపర్లు - బుక్కులు - పెన్సిల్లు చిందరవందరగా ఉంటే కొన్ని కొన్ని సార్లు మనం మన ఇళ్లను చూసుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది . ఆ కోపంలో చిరాకుల్లో పిల్లలను కొడుతూ ఉండడం ..మాటా మాట అనుకోవడం రకరకాల సమస్యలకు దారి తీస్తాయి. మానసికంగా సంతోషంగా ఉండలేరు . మనసు ఆరోగ్యానికి ఇల్లు శుభ్రంగా ఉండడం చాలా చాలా మంచిది అంటున్నారు నిపుణులు..!
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు ఏదైన పాఠించే ముందు ..మీరు విశ్వసించే పండితులను సంప్రదించడం ఉత్తమం అని గుర్తుంచుకోండి..!!