కొన్ని సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుండ‌నిపిస్తుంది...కానీ కొన్ని సినిమాల రీమేక్ ల‌ను చూస్తే ఎందుకు రీమేక్ చేసారా అనిపిస్తుంది. అలాంటి సినిమాలు టాలీవుడ్ లో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక‌టి జాను. ఈ సినిమా తమిళంలో 96పేరుతో విడుద‌లైంది. 1996వ ప‌దోత‌రగ‌తి బ్యాచ్ ఆ బ్యాచ్ లోని అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌టం..ఆ త‌ర‌వాత ఎవేవో కార‌ణాల వ‌ల్ల ఇద్దరూ క‌లుసుకోలేక‌పోవ‌డం..చివ‌రికి గెట్ టూ గెథ‌ర్ లో క‌లుసుకుని బాధ‌ప‌డ‌టం. ఇలాంటి సినిమాలు తెలుగులో ఎన్నో వ‌చ్చాయి. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మ‌రియు మ‌రిన్ని సినిమాలు 96 సినిమా లాంటివే..అయితే సినిమా క‌థ రొటీన్ అయినా చూసేందుకు మాత్రం 96 ఎంతో ఎమోష‌నల్ గా ఉంటుంది. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి మ‌రియు త్రిష త‌న న‌ట‌న హావ భావాల‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తారు. 

సినిమా మొద‌లుకుని చివ‌రి వ‌ర‌కూ ఆద్యంతం ఎంతో ఆస‌క్తిగా ఫీల్ గుడ్ గా ఉంటుంది. ఇక ఈ సినిమాకు త‌మిళంలో మంచి మార్కులు  ప‌డ‌టంతో సోష‌ల్ మీడియాలో ఈ సినిమా గురించి జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దాంతో ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల వ‌ద్ద‌కు కూడా చేరింది. ఈ నేప‌థ్యంలో తెలుగు ప్రేక్ష‌కులు కూడా చాలా మంది 96 సినిమాను స‌బ్ టైటిల్స్ చ‌దువుకుంటూ త‌మిళ్ అర్థం కాకున్నా చూసేసారు. అయితే సినిమా చూడ‌ని వాళ్లు మాత్రం ఈ సినిమా తెలుగులో వ‌స్తే బాగుండ‌ని అనుకున్నారు. ఇక నిర్మాత దిల్ రాజు కూడా అలాగే అనుకున్న‌ట్టు ఉన్నారు.

96సినిమాను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో శ‌ర్వానంద్ హీరోగా న‌టించ‌గా....స‌మంత హీరోయిన్ గా న‌టించింది. అయితే ఈ సినిమా త‌మిళంలో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకోగా తెలుగులో మాత్రం జాను బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. 96 సినిమాలో విజ‌య్ సేతుప‌తి ప్రేమ విఫ‌ల‌మై ఏజ్ బారై పోయిన‌ట్టు మాసిన గ‌డ్డం....పొట్ట‌తో కనిపించ‌గా తెలుగు జానూలో శ‌ర్వానంద్ ఎంత ట్రై చేసినా యంగ్ గా  హ్యాండ్ స‌మ్ గానే క‌నిపించాడు. అంతే కాకుండా చాలా  విష‌యాల్లో జాను ...96 చేసిన మ్యాజిక్ చేయ‌లేక‌పోయింది. దాంతో 96 సినిమాను రీమేక్ చేసి త‌ప్పు చేశార‌ని తెలుగు ప్రేక్ష‌కులు బావించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: