ప్లేబ్యాక్ సింగర్ గా తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకొని అన్ని భాషలలో గాయకురాలిగా నెంబర్ వన్ స్థానం లో దూసుకుపోతుంది సింగర్ చిన్మయి. టాలీవుడ్ హీరో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ను పెళ్లి చేసుకున్న ఈ గాయని వైవాహిక జీవితంతో పాటు తన సినిమా జీవితాన్ని కూడా ఎంతో ఆనందంగా గడుపుతుంది. భాషా శాస్త్రవేత్తగా, సంగీత విద్వాంసురాలుగా, గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా ఈమె అన్ని భాషల చిత్రపరిశ్రమలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పలు విజయవంతమైన చిత్రాలకు డబ్బింగ్ చెప్పి నంది అవార్డును కూడా గెలుచుకుంది. అలాంటి చిన్మయి అప్పుడప్పుడు కొన్ని వివాదాలలో నలగడం ఆమె అభిమానులను ఎంతగానో కలవర పెట్టిస్తుంది.

సన్ టివి లో జరిగిన ఓ ప్రముఖమైన సింగిగ్ షో లో విజేతగా నిలిచిన ఆమె కొన్ని అద్భుతమైన పాటలు పాడి బెస్ట్ సింగర్ గా తన ప్రతిభను నిరూపించుకుంది. మలయాళం తెలుగు తమిళ ఇంగ్లీష్ మరాఠీ బెంగాలీ జర్మన్ భాషలను ఎంతో స్పష్టంగా మాట్లాడగల ఈమెకు దాదాపు అన్ని భాషలలోనూ ప్రావీణ్యం ఉంది. అందుకే కాబోలు ఆమెకు అన్ని భాషల సినిమా నుండి అవకాశాలు వస్తాయి. బ్యాచలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ సైకాలజీలో ప్రావీణ్యత పొందిన ఈమె యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి పట్టా పొందింది.  డాన్సర్ గా నటిగా కూడా ఈమె రాణించగలదు.

ఇలా తనకే సొంతమైన అన్ని రకాల విద్యలతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆ మధ్య ఈమె ప్రముఖ సాహిత్యవేత్త వైరముత్తు పై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ ఆడవారికి ఏదైనా ఆపద వస్తే తాను ముందుండి వారికి రక్షణగా నిలుస్తుంది. ఇక నటిగా ఆమె తన కెరీర్ ను అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రం తో మొదలు పెట్టింది. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె నటిగా ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సమంతకు డబ్బింగ్ చెప్పి ఈమె డబ్బింగ్ కళాకారిణిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: