రాజమౌళి తీస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ పై అందరిలోనూ ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. డివివి దానయ్య తీస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ కథానాయికలుగా యాక్ట్ చేస్తుండగా సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియ ఇతర పాత్రలు చేస్తున్నారు.

ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ సినిమా నుండి ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ టీజర్లు యూట్యూబ్ లో రిలీజ్ అయి అందరిలో సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పరిచాయి. భారీ స్థాయి పెట్రియిటిక్ డ్రామా మూవీ గా సాగనున్న ఈ సినిమాలో అంతర్లీనంగా స్నేహానుబంధానికి సంబంధించి మంచి మెసేజ్ కూడా మిళితం అయి ఉంటుందని ఇన్నర్ వర్గాల టాక్. ఇక ఈ మూవీని భారీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా రాజమౌళి తెరకెక్కించినట్లు సమాచారం. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇప్పటికే పలుమార్లు విడుదల విషయమై వాయిదా పడ్డ ఆర్ ఆర్ఆర్ మూవీ మరొక్కసారి లేటెస్ట్ గా వాయిదా పడిన విషయం తెలిసిందే.

వాస్తవానికి దసరా కానుకగా వచ్చే నెల 13న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మూవీకి సంబంధించి ఇంకా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో మూవీని కొన్నాళ్లపాటు వాయిదా వేశారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పక్కాగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యేది వచ్చే ఏడాది సమ్మర్ కే అని అంటున్నారు. నిజానికి ముందుగా సంక్రాంతికి విడుదల చేద్దాం అని భావించినప్పటికీ, ఆ సమయానికి ఇప్పటికే పలు బడా మూవీస్ బెర్త్ లు కన్ఫర్మ్ చేసుకోవడంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ సమ్మర్ వెళ్లక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని, త్వరలోనే ఆర్ఆర్ఆర్ అఫీషియల్ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: