టాలీవుడ్ లో హీరో సూర్య కు ఎంత మంచి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ క్రేజ్ అంతా కేవలం గజినీ సినిమా వల్ల ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు సూర్య సెకండ్ హీరోగా, క్యారెక్టర్ గా ఆర్టిస్టుగా తన కెరీర్ ను ప్రారంభిస్తూ వచ్చాడు. గజిని సినిమా తో అమాంతం స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా 2005 సంవత్సరంలో ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించాడు.ఈ సినిమా తెలుగు,తమిళ భాషలలో ఒకేసారి విడుదలై మంచి రెస్పాన్స్ ను అందించింది.

ఇక ఈ సినిమా పాటలు ముందుగానే విడుదలై బాగా పాపులర్ కావడం వల్ల ఈ సినిమాకి ప్లస్ గా నిలిచింది. ఈ సినిమాకి హరీష్ జయరాజ్ సంగీతం అందించాడు. గజిని సినిమా విడుదల ఈ రోజుకి 16 సంవత్సరాలు కావస్తోంది. ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో ఇప్పుడు ఒక సారి చూద్దాం.

1). నైజాం-4.72 కోట్ల రూపాయలు.
2). ఉత్తరాంధ్ర-1.74 కోట్ల రూపాయలు.
3). సీడెడ్-1.67 కోట్ల రూపాయలు.
4). వెస్ట్-57 లక్షలు.
5). ఈస్ట్-65 లక్షలు.
6). గుంటూరు-79 లక్షలు.
7). నెల్లూరు-36 లక్షలు.
8). కృష్ణ-66 లక్షలు.


ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ మొత్తం కలెక్షన్లు..11.16 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

ఇక ఈ సినిమాని తెలుగు ఇండస్ట్రీలో.. అల్లు అరవింద్, ఠాగూర్ మధు వంటి పెద్ద నిర్మాతలు ఈ సినిమాని సొంతంగానే విడుదల చేశారు. అయినప్పటికీ సినిమా..3.2 కోట్ల షేర్ను రాబర్ట్ పాలసీ ఉండగా.. ఫుల్ రన్ టైం ముగిసేసరికి ఈ సినిమా దాదాపుగా..11.16 కోట్ల రూపాయల షేర్ని అందుకుంది.

ఇక హైదరాబాదులో నైజం వంటి ఏరియాలలో తమిళ వర్షన్ గజిని సినిమా ను కూడా విడుదల చేయడం జరిగింది. కానీ నీ ఈ కలెక్షన్లు బయటికి చెప్పలేదు. తెలుగు వర్షం పరంగా గజిని సినిమా.. మూడు రెట్ల అధిక లాభాన్ని తెచ్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు. దీంతో సూర్య మార్కెట్ బాగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: