ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రోజ్ విల్లా సినిమా ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది. అమెజాన్ ప్రైమ్, ధియేటర్ లలో ఈ సినిమా విడుదల కాగా థ్రిల్లర్ సినిమా గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో థ్రిల్ కి గురి చేస్తుండడం విశేషం. హేమంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో దియా ఫేం దీక్షిత్ శెట్టి హీరో గా నటించగా శ్వేతా వర్మ హీరోయిన్ నటించింది. వెన్నెల రామారావు ముఖ్య పాత్ర లో నటించగా ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం విశేషం.

అడవిలో దారి తప్పిన ఓ పెళ్ళైన జంట నక్సల్ ఏరియా లోకి వెళ్లి అక్కడి నుంచి పోలిసుల ద్వారా కాపాడబడి ఓ రెస్టారెంట్ కి చేరుకుంటారు. అక్కడ రిటైర్ కల్నల్ అయిన సోలోమన్ ను కలిసి ఆయనను ఓ ప్రమాదం నుంచి కాపాడతాడు హీరో. అలా వారి మధ్య పరిచయం కాగా సోలోమన్ అతని భార్య ఇద్దరు ఈ జంటను తమ ఇంటికి డిన్నర్ కి ఆహ్వానిస్తారు.. ఆరోజు తమ పెళ్లి రోజని తప్పకుండా రావాలని బాగా రిక్వెస్ట్ చేయడం తో వారు తప్పక వెళ్ళాల్సి వస్తుంది. అయితే ది రోజ్ విల్లా అనే పిలవబడే ఇంటికి వెళతారు రవి దంపతులు. అక్కడికి వెళ్ళిన తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ ఇంటి నుంచి వారు బయటకి రాకపోవడానికి గల కారణం ఏంటి అనేది ఈ సినిమా కథ..

నటీనటులు ఈ సినిమా లో నటించి సినిమా హిట్ కు కారణమయ్యారు.. దీక్షిత్ శెట్టి సినిమా కు ప్రాణం పోశారు. శ్వేతా వర్మ కూడా తన అభినయం తో ఆకట్టుకుంది.. ఇక రాజ రవీంద్ర పాత్ర గురించి చెప్పనవసరం లేదు. అందరు కూడా తమ నటన తో సినిమా ను హిట్ చేశారు. ఇక కథ సింపుల్ గా ఎంచుకుని స్క్రీన్ ప్లే ని చాలా బాగా సిద్ధం చేశారు దర్శకుడు హేమంత్. అయన విజన్ కి తగ్గట్లుగా ఈ సినిమా ఉంది. ఈ సినిమాలో మరింత ఆకట్టుకునే విధం గా మాటలున్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా కు తగ్గట్లుగా చాలా బాగున్నాయి. సినిమా చూసిన వారంతా ఈ సినిమా హాలీవుడ్ ఫ్లేవర్ లో ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: