ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ సింగర్ ఎవరు అంతే సిద్ శ్రీరామ్ అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఏ సినిమా విడుదలైన కూడా ఆ సినిమాకు సంబంధించిన తొలి పాట తప్పకుండా సిద్ శ్రీరామ్ పాడే పాట అయ్యే ఉంటుంది. సంవత్సరాలు గడుస్తున్నా కూడా సిద్ క్రేజ్ , డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు సైతం ఆయన పాటలు పాడటం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా సర్కారు వారి పాట సినిమాలో కళావతి పాటకు సిద్దు శ్రీరామ్ తన గొంతు కలిపాడు.

ఇది భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోగా సౌత్ ఇండియా సినిమా లోనే అత్యంత వేగవంతమైన వ్యూస్ అందుకున్న పాట గా నిలిచింది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాట లీక్ కావడంతో చిత్ర బృందం తో పాటు మ్యూజిక్ బృందం ఎంతో నిరాశ పడింది దీంతో వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కావలసిన ఈ పాట ఒక రోజు ముందుగానే విడుదల అయ్యింది. అయితే ఈ పాట లీక్ అయినా కూడా కూడా తాము ఏ మాత్రం నిరాశ చెందలేదు అన్నట్లుగా ఈ పాటకు భారీ స్థాయిలో వ్యూస్ అందించారు ప్రేక్షకులు. 

ఆ విధంగా తన గాత్రంతో ఇప్పటివరకు కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సిద్ శ్రీరామ్ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలతో కూడా అలరిస్తూ అందరికీ మైమరిపించే చేస్తున్నారు. ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం కు మాత్రమే ఈ విధమైన పాటలు పాడే అవకాశం వచ్చేది. ఆ తర్వాత సిద్ శ్రీరామ్ ఈ విధమైన రేంజ్ లో పాటలు పాడుతున్నారు అని చెప్పాలి. మరి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పాటలతో ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తాడో చూడాలి. తనకే సొంతమైన గాత్రంతో ఎవరికీ సొంతం కానీ మేనరిజంతో పాటలు పాడుతూ ఆయన మరింత ముందుకు దూసుకుపోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: