రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఇక ఈమె మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు సంపాదించుకోకపోయినా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు పొందింది రకుల్. ఇక మన టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించి స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో నటించి భారీ గుర్తింపును తెచ్చుకుంది. అయితే దీని అనంతరం దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పరచుకున్నారు.అయితే ఇలా ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు..

ఇకపోతే రకుల్ నటించిన ఎటాక్ సినిమా ఇటీవలే విడుదలైంది.అయితే ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండి తన అభిమానులతో కలిసి తాజాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సేషన్ నిర్వహించారు.కాగా ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఈ ముద్దుగుమ్మ సమాధానాలు తెలియజేశారు.అయితే ఈ సందర్భంగా ఒక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ మీకు తెలుగులో నచ్చిన హీరో ఎవరు అని ప్రశ్నించారు.ఇకపోతే  ఈ విధంగా నెటిజన్ తన ఫేవరెట్ హీరో పేరు చెప్పమని అడగగానే వెంటనే రకుల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెప్పేశారు.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ అల్లు అర్జున్ తో కలిసి సరైనోడు సినిమాలో నటించారు.ఇక ఇలా తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అని చెప్పడంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది.అయితే  ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తమిళంలో అయలాన్ ,హిందీలో డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్‌, రన్ వే 34, మిషన్ సిండెరెల్లా సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది ఈ బ్యూటీ.తాజాగా ఈ భామ నటించిన రన్ వే 34 ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని కనబర్చింది.ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: