టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచు విష్ణు చేసే సినిమాలకు మంచి క్రేజే ఉంటుంది అని చెప్పాలి. తెలుగు సినిమా పరిశ్రమలో వారసుల హీరోలు ఎక్కువగా ఉంటారు. అలా మంచు మోహన్ బాబు వారసుడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి మంచి సినిమాల తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటున్నాడు మంచు విష్ణు. అలా తొలి రోజులలో ఆయన ఢీ అనే సినిమాతో సాధించిన విజయాన్ని ఇప్పటికీ ఎవరు మరిచిపోలేరనే చెప్పాలి.

అంతటి స్థాయిలో మళ్లీ ఆయన విజయం అందుకోలేకపోయినా కూడా ఆ సినిమా ఆయన కెరియర్ లోనే ఎప్పటికీ నిలిచిపోతుంది అని చెప్పాలి. దూసుకెళ్తా, దేనికైనా రెడీ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు మరొక వెరైటీ కాన్సెప్ట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. జిన్నా అనే ఓ సరికొత్త సినిమాను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. 

ఈ సినిమాలో మంచు విష్ణు సరికొత్తగా కనిపిస్తూ ఉండడం విశేషం. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా ఇది మొదలు పెట్టుకున్నప్పటికీ ఫైనల్ గా ప్రోమో ప్రకారం ఈ సినిమా ఒక హారర్ అని తెలుస్తుంది. హీరోయిన్ గా పాయాల్ రాజ్ పుత్ నటిస్తూ ఉండగా ప్రముఖ పాత్రలో సన్నిలియోన్ నటిస్తూ ఉండడం ఈ సినిమా పట్ల ఇంతటి స్థాయిలో అంచనాలు పెరగడానికి ముఖ్య కారణం. మరి ఈ సినిమాను ఈ హీరో ఎప్పుడు విడుదల చేస్తాడో చూడాలి. ఈ సినిమాతో పాటే శ్రీనువైట్ల దర్శకత్వంలో కూడా ఈ హీరోసినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీనికి ఢీ అండ్ ఢీ అనే టైటిల్ ను నిర్ణయించారు. మరి ఈ రెండు సినిమాలతో మంచు విష్ణు మళ్ళీ విజయపు బాట పడతాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: