తెలుగు చిత్ర పరిశ్రమలో అందనంత ఎత్తులో ఉన్న హీరో అంటే ఠక్కున రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తోంది.. బాహుబలి తర్వాత డార్లింగ్ పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టాడు.అన్ని అవే సినిమాలను చేస్తున్నాడు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'సలార్' ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.


ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న తరుణంలో, చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. సలార్ చిత్రాన్ని 2023 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు సరిగ్గా మరో ఏడాది సమయం ఉండటంతో అప్పుడే ఈ సినిమాను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు..


ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు..ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో లీకైన ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.గతంలో వచ్చిన ప్రభాస్ సినిమాలు అన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.ఈ సినిమా అన్నా డార్లింగ్ కు మంచి హిట్ ను ఇస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: