కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి మంచి అంచనాలు నడుము సెప్టెంబర్ 30 వ తేదీన కన్నడ భాషలో విడుదల అయిన కాంతారా సినిమా ఇప్పటికే కన్నడ సినిమా ఇండస్ట్రీ లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కాంతారా మూవీ ఇప్పటికే కన్నడ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను కూడా కొల్లగొట్టింది. ఇలా కన్నడ ప్రేక్షకుల మనసు దోచుకున్న కాంతారా మూవీ అక్టోబర్ 15 వ తేదీన తెలుగు లో కూడా విడుదల అయింది.

మూవీ ని తెలుగు లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల చేశాడు. ఈ మూవీ కి తెలుగు లో కూడా అద్భుతమైన పాజిటివ్ టాక్ లభించింది. ప్రస్తుతం ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ని రెండు సార్లు చూశాను అని ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయిన అనుష్క శెట్టి "కాంతారా" మూవీ పై ప్రశంసల వర్షం కురిపించింది.

తాజాగా అనుష్క శెట్టి "కాంతారా" సినిమా చాలా బాగుంది. నటీనటులు అందరూ కూడా అద్భుతంగా నటించారు.  మూవీ బృందానికి శుభాకాంక్షలు. రిషబ్ శెట్టి నటన చాలా అమేజింగ్ గా ఉంది. ఇలాంటి మూవీ ని తప్పనిసరిగా థియేటర్ లోనే చూడండి. మిస్ అవ్వద్దు అంటూ అనుష్క తన సోషల్ మీడియా వేదికగా కాంతారా మూవీ పై స్పందించింది. కాంతారా మూవీ ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతూ ఫుల్ జోష్ లో ముందుకు దూసుకు పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: